కళాతపస్వి ఇంట్లో మరో విషాదం.. కే విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మీ కన్నుమూత

Siva Kodati |  
Published : Feb 26, 2023, 07:44 PM ISTUpdated : Feb 26, 2023, 08:05 PM IST
కళాతపస్వి ఇంట్లో మరో విషాదం.. కే విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మీ కన్నుమూత

సారాంశం

ఇటీవల కన్నుమూసిన దర్శకుడు ,కళాతపస్వి కే.విశ్వనాథ్ ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి జయలక్ష్మీ అనారోగ్యంతో కన్నుమూశారు. 

ఇటీవల కన్నుమూసిన దిగ్గజ దర్శకుడు ,కళాతపస్వి కే.విశ్వనాథ్ ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి జయలక్ష్మీ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆదివారం గుండెపోటుకు గురికావడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే జయలక్ష్మీ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also REad: కె విశ్వనాథ్‌, ఎస్పీబాలు, చంద్రమోహన్‌ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ ఏంటో తెలుసా? ముగ్గురు కలిసి చరిత్రకి నాంది

విశ్వనాథ్ ఫిబ్రవరి 2న పరమపదించారు. సినిమాను కళగా నమ్మిన దర్శకుడిగా విశ్వనాథ్ అజరామరమైన చిత్రాలు తీశారు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. మరుగున పడుతున్న మన సంస్కృతికి, కళలకి తన సినిమాలతో ప్రాచుర్యం కల్పించి బ్రతికించారు. కే విశ్వనాథ్ సాహిత్యానికి, కళలకు చేసిన సేవ మరువలేనిది. 

ఆయన పూర్తి పేరు కాశినాథుని విశ్వనాథ్‌. ఆయన 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. కానీ.. సినిమాలపై అభిమానంతో  చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆయన వాహిని స్టూడియోస్‌లో సౌండ్‌ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1965లో దర్శకుడిగా మారి ఆత్మగౌరవం సినిమాను తెరకెక్కించారు.

ALso REad: K viswanath: ఓ సూట్ కలిపిన బంధం.. కే విశ్వనాథ్ కి ఈయన చాలా ప్రత్యేకం

ఆ తరువాత ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం వంటి ఎన్నో క్లాసికల్‌ హిట్ మూవీస్ ను ప్రేక్షకులకు అందించారు. ఆయన కేవలం డైరెక్టర్ గానే కాకుండా.. నటుడిగా కూడా తన సత్తా చాటుకున్నారు. తొలిసారి శుభసంకల్పం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన ఆయన ..వజ్రం, కలిసుందాంరా, నరసింహనాయుడు, సీమసింహం, నువ్వులేకనీను లేను, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో, ఠాగూర్‌ వంటి పలు చిత్రాల్లో తన నటనతో మెప్పించారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?