న్యూడ్ ఫొటోషూట్ పై ట్రోల్స్.. ఇన్నాళ్లకు రియాక్ట్ అయిన నటి కస్తూరి.!

By Asianet News  |  First Published Feb 26, 2023, 7:42 PM IST

నటి కస్తూరి శంకర్ (Kasturi Shankar) సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఈక్రమంలో తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటరర్వ్యూలో తను గతంలో చేసిన ఓ ఫొటోషూట్, డ్రెస్సింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


నటి కస్తూరి ప్రస్తుతం సీరియల్ స్టార్ గా మంచి క్రేజ్ దక్కించుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కస్తూరి బుల్లితెరపై అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నారు. బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ భారతీయుడు, అన్నమయ్య లాంటి చిత్రాలతో తనదైన నటనతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇక తమిళం, తెలుగు రెండు భాషల్లోనూ హీరోయిన్ గా కస్తూరి ఆయా చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్ నటిగా అలరిస్తున్నారు. ‘గృహలక్ష్మి’ డైలీ సీరియల్ లో ‘తులసి’పాత్రతో మంచి ఫేమ్ దక్కించుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఇలా క్రేజ్ దక్కించుకుంటున్నారు.  

అయితే, కస్తూరి సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటారు. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా గతంలో ఆమె మదర్ హుడ్ ఫొటోషూట్ చేసింది. అర్ధనగ్నంగా చిన్నపిల్లాడిని ఎత్తుకున్న ఆ పిక్స్ వైరల్ గా మారాయి. దానిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది. 

Latest Videos

అమెరికాలోని ఓ సంస్థ కోసం అలా ఫొటోషూట్ చేయాల్సి వచ్చింది. అయితే అక్కడి ఫొటోషూట్ ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాలేదన్నారు. ఆఫొటోలో ఇక్కడ వైరల్ అయిన సమయంలో కాస్తా భయమేసిందన్నారు. అమెరికాలో అలా నడుస్తుంది గానీ.. మనవాళ్లు ఒప్పుకోరేమోనని.. చాలా ట్రోల్స్ చేస్తారని ఆందోళన చెందాను. కానీ ఆ ఫొటోపై ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా రాలేదు. పైగా తను తమిళనాడుకు వెళ్లిన సందర్భంలో మహిళలు చాలా డివోషనల్ గా ఉందంటూ అభినందించారని పేర్కొంది. వారి మెట్యూర్టీకి సంతోషంగా ఫీల్ అయ్యారని తెలిపింది. మరికొందరు మాత్రం మిమర్శించి ఉండొచ్చు.. తనకు రెస్పెక్ట్ ఇచ్చేదేందనే వాళ్లూ ఉండి ఉంటారని అభిప్రాయపడింది.

మరోవైపు డ్రెస్సింగ్ పైనా స్పందించారు. తనవరకు ఏదైనా డ్రెస్ కంఫర్ట్ గా అనిపిస్తే మాత్రం ధరిస్తానని.. వాళ్లేమంటారో.. వీళ్లేమంటారో ఆలోచించనంటూ నిర్మోహమాటంగా బదులిచ్చింది.  ఇక సినిమాల విషయంలోనూ అలాంటి దుస్తులు ధరించాల్సి వస్తుందని, అది తన డ్యూటీగానే భావిస్తానని చెప్పారు. ఈవిషయంలో కొందరు విమర్శించారని.. తమ ఇండ్లలో తనపై ఉన్న అభిమానం పోయిందంటూ కామెంట్లు కూడా చేశారని కూడా చెప్పుకొచ్చింది. దేన్నైనా పాజిటివ్ లైన్ లో చూస్తే అంతా సరిగానే ఉంటుందని చెప్పుకొచ్చింది. 
 

click me!