jurassic world: రాక్షస బల్లులు ప్రపంచానికి ఇక శెలవు..ఇదే లాస్ట్

Surya Prakash   | Asianet News
Published : Jun 07, 2022, 09:42 AM IST
jurassic world: రాక్షస బల్లులు ప్రపంచానికి ఇక శెలవు..ఇదే లాస్ట్

సారాంశం

ప్రొడక్షన్ హౌస్  యునివర్సల్ పిక్చర్స్ ఇది లాస్ట్ పార్ట్ అని అధికారికంగా ప్రకటించింది. అంటే ఇకపై ఈ లెగసీ కొనసాగదు. ఏదైమైనా ఇంక రాక్షస బల్లులు శెలవు తీసుకోబోతున్నాయి.  

1993 నుంచి వరసగా జురాసిక్‌ వరల్డ్‌ సిరీస్‌ ప్రపంచ సినీ  ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తూ వస్తోంది. ఈ సీరిస్ లో తాజాగా తెరకెక్కిన  చిత్రం ‘జురాసిక్‌ వరల్డ్‌: డామినియన్‌’. యూనివర్శల్‌ పిక్చర్‌ స్టూడియోస్‌ నిర్మించిన  ఈ చిత్రానికి కోలిన్‌ ట్రెవొరో దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పటికే ఓవర్ సీస్ లో యుఎస్ మినహా  15 దేశాల్లో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. అమెరికాలోనూ, ఇండియాలోనూ  ఈ సినిమాను జూన్‌ 10, 2022లో విడుదల కానుంది. 

‘‘కోవిడ్ పరిస్థితుల వల్ల మా సినిమా విడుదల ఆలస్యం అయినప్పటికీ, దానికి తగ్గట్టుగానే మా చిత్రం ఉంటుంది. ప్రేక్షకులను రెండింతలు థ్రిల్‌ చేసేలా మా సినిమాని తీర్చిదిద్దాం’’ అన్నారు దర్శకుడు కోలిన్‌.  జురాసిక్‌ వరల్డ్‌ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ సిరీస్‌లోని థ్రిల్లింగ్ సినిమాల కోసం వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. 

 ది లాస్ట్ వరల్డ్, జురాసిక్ పార్క్ 3, జురాసిక్ వర్డ్, జురాసిక్ వరల్డ్ 2 ఫాలెన్ కింగ్ డం తర్వాత ఇప్పుడు రెడీ అయిన  చివరి పార్ట్  జురాసిక్ వరల్డ్ డామినియన్. మన దేశంలో ఒక రోజు ముందే అంటే 9నే ప్రీమియర్లు పడబోతున్నాయి. హైదరాబాద్  వంటి మెట్రో సిటీల్లో నెల రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ప్రొడక్షన్ హౌస్  యునివర్సల్ పిక్చర్స్ ఇది లాస్ట్ పార్ట్ అని అధికారికంగా ప్రకటించింది. అంటే ఇకపై ఈ లెగసీ కొనసాగదు. ఏదైమైనా ఇంక రాక్షస బల్లులు శెలవు తీసుకోబోతున్నాయి.

ప్రకృతిని తమ ఆదీనంలో తీసుకుని మనుష్యలతో కలిసి డైనోసర్స్    జీవించే విధంగా చేయాలని అనుకుంటారు కొంత మంది వ్యక్తులు.దాని కోసం రకరకాల పయత్నాలు చేస్తారు. అయితే భూమీ పై    రెండు విభిన్న జాతులు కలిసి సహజీవనం చేయడం అసాధ్యమని..ప్రకృతికి విరుధంగా వెళ్లితే    వినశనమే జరుగుతుందని గ్రహించి వాటిని అంతచేయాలని చూస్తారు. ఈ పోరులో రెండు జాతుల మధ్య జరిగిన పోరటాన్ని విజవల్ వండర్ గా డైరెక్టర్ చూపించాడు . గాలి, నీరు, నింగి, మంచు.. ఇలా ఏది వదలకుండా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో.. థ్రిల్లింగ్ సీన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది.మంచు కొండల్లో , సముద్రం దగ్గర వచ్చే సీన్స్...థ్రిలింగ్ గా ఉంటే    క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ పార్ట్ సినిమా పై    అంచనాలను భారీగా పెంచేస్తుంది.    'జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్‌డమ్ కి మించిన యాక్షన్ పార్ట్    ఇందులో ఉంటుందని    ట్రైలర్ ద్వారా చెప్పకనే చెప్పారు దర్శక నిర్మాతలు.

'జురాసిక్ వరల్డ్ డొమినియన్' చిత్రం ఎక్కువగా మంచుతో నిండిన భూభాగంలో తెరకెక్కించినట్టు ప్రకటించారు మేకర్స్ . ఈ సినిమాలో ప్రధాన హైలైట్ ఏమిటంటే, సామ్ నీల్, జెఫ్ గోల్డ్‌బ్లమ్ మరియు లారా డెర్న్‌లతో కూడిన అసలు జురాసిక్ పార్క్ త్రయం తిరిగి రావడం.డైనోసార్లు వికృతి రీతిలో విరుచుకుప‌డే సన్నివేశాల‌తో ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది. టీ-రెక్స్ లాంటి డైనోలతో పాటు కొత్త త‌ర‌హా డైనోసార్లను ఈ చిత్రంలో ప‌రిచ‌యం చేస్తున్నారు మేకర్స్. స్టీవెన్ స్పిల్‌బ‌ర్గ్ తీసిన తొలి జురాసిక్ పార్క్ చిత్రంలో న‌టించిన కొంద‌రు న‌టులు డొమీనియ‌న్‌లో కూడా కనిపిస్తున్నారు. మిలియన్ల సంవత్సరాల క్రితం జరిగిన ఒక చర్య ఆధునిక కాలంలో డైనోసార్ తీరిగి జన్మించడానికి   ఎలా దారితీసింది అనేది ఈ సినిమా కీ పాయింట్.  మరి జురాసిక్ వరల్డ్ సీరిస్‌లో వస్తున ఈ ఆఖరి చిత్రం వరల్డ్ వైడ్ గా ఎలాంటి సంస్షెషన్ క్రియేట్ చేస్తుందో.. చూడాలి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ