ఫ్యాన్స్ లో ఆందోళన, భద్రతా వలయంలో సల్మాన్ ఖాన్, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

Published : Jun 07, 2022, 06:38 AM IST
ఫ్యాన్స్ లో ఆందోళన, భద్రతా వలయంలో సల్మాన్ ఖాన్, కట్టుదిట్టమైన  ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

సారాంశం

సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు విషయంలో ఫ్యాన్స్ లో ఆందోళన మొదలయ్యింది. తమ అభిమాన స్టార్ కు ఎప్పుడు ఏమౌతుందా అన్న భయాన్ని  వ్యక్తం చేస్తున్నారు. దాంతో ప్రభుత్వం  సల్మాన్ భద్రతను భారీగా పెంచింది.   

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ భద్రతను మరింత పటిష్ఠం చేస్తూ మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది.  
సల్మాన్ కు ఆయన కుటుంబానికి బారీ బందోబస్తును ఏర్పాటు చేయనుంది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే సల్మాన్ కు అతని తండ్రి  సలీమ్ ఖాన్ కు త్వరలోనే పడుతుందని  హెచ్చరిస్తూ... లేఖను గుర్తు తెలియని వ్యక్తులు పంపించిన నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. 

తుమ్హారా మూసే వాలా కర్ దేంగే’ అని సదరు లేఖలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అందులో రాసిన వారు పేరు కానీ, సంతకం కానీ లేవు. సల్మాన్ ఖాన్ రోజూ వాకింగ్ చేసే ప్రాంతంలో బల్లపై కూర్చుంటారు. దానిపైనే ఆగంతుకులు లేఖను వదిలి వెళ్లారు. తన సెక్యూరిటీ గార్డుల ద్వారా పోలీసులకు సల్మాన్ సమాచారం ఇచ్చారు. దీనిపై పోలీసులు కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా పంజాబీ సింగర్, కాంగ్రెస్  నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో  ప్రధాన నిందితుడు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్టోయ్‌  అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లారెన్స్ గతంలో సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడిన ఒక వీడియో మరోసారి తెరపైకి వచ్చింది. 2018 లో ఒక కేసులో లారెన్స్‌ బిష్ణోయ్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన అతడి అనుచరులకు ఢిల్లీ హైకోర్డు రిమాండ్ విధించింది. అప్పుడు మీడియా ముందు లారెన్స్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను ఏం చేయలేదని... కానీ, తాను ఏమి చేయగలనో, ఏం చేస్తానో అప్పుడే మీకు తెలుస్తుంది. రాజస్థాన్‌లో సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తాను... మీరేం చేస్తారో అప్పుడు చూస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 

అప్పట్లో ఈ వార్త సంచలనం సృష్టించింది.. అప్పటినుంచి పోలీసులు  ఈ ముఠాపై నిఘా పెట్టారు. మధ్యలో సల్మాన్ ఇంటిపై రెక్కీ నిర్వహించిన ఈ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. తాజాగా మూసేవాలా దారుణ హత్య నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. తాజాగా సల్మాన్‌కు బెదిరింపు లేఖ నేపథ్యంలో ఆయనకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

ధురంధర్ స్టార్ రణ్‌వీర్ సింగ్ 100 కోట్ల ఇల్లు, అరేబియా సముద్రం కనిపించేలా అద్భుత భవనం ఎలా ఉందో చూశారా?
Brahmamudi Serial Today Episode: పవర్ ఆఫ్ అటార్ని నుంచి రేఖను తప్పించాలని అపర్ణ ప్లాన్, ఇందు ఫోన్ పగలగొట్టిన రాజు