నేను ఆరోగ్యంగానే ఉన్నాను, వదంతులు నమ్మకండి అలనాటి స్టార్ హీరో ధర్మేంద్ర, ఇన్ స్టా వీడియోలో వివరణ

Published : Jun 07, 2022, 09:30 AM ISTUpdated : Jun 07, 2022, 09:33 AM IST
నేను ఆరోగ్యంగానే ఉన్నాను, వదంతులు నమ్మకండి అలనాటి స్టార్ హీరో  ధర్మేంద్ర, ఇన్ స్టా వీడియోలో వివరణ

సారాంశం

అలనాటి అందాల నటుడు.. బాలీవుడ్ స్టార్ ధర్మేంద్ర ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందంటూ  పుకార్లు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ఈ విషయంలో ఆయన క్లారిటీ ఇచ్చాడు. 

తాను ఆసుపత్రి పాలైనట్టు వస్తున్న వార్తలను బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కొట్టిపడేశారు. 86 ఏళ్ల ఈ స్టార్ హీరో  తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు, ధర్మేంద్ర ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందంటూ సోషల్ మీడియాలో  పుకార్లు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు.   తనపై వస్తున్న వదంతులకు క్లారిటీ ఇచ్చారు. 

తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, వదంతులు నమ్మొద్దని ఆ వీడియోలో అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తాను మౌనంగా ఉన్నాను తప్పితే అనారోగ్యంగా లేనని స్పష్టం చేశారు. ఇతరులకు ప్రేమను పంచితే జీవితం అందంగా ఉంటుందన్న ధర్మేంద్ర వదంతులు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ధర్మేంద్ర ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఆయన కుమారుడు బాబీడియోల్ కూడా ఖండించారు.  కాగా, నెల రోజుల క్రితం ధర్మేంద్ర రొటీన్ చెకప్‌లో భాగంగా బ్రీచ్ కాండీ ఆసుపత్రికి వెళ్లారు. అప్పట్లో ఆయన ట్విట్టర్ ద్వారా తాను ఆసుపత్రికి ఎందుకు వెళ్లిందీ వెల్లడించారు. 

 

నడుం నొప్పి కారణంగా ఆసుపత్రికి వెళ్లానని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇప్పుడు మరోమారు ఆయన ఆరోగ్యంపై వదంతులు వ్యాపించడంతో స్పందించి వివరణ ఇచ్చారు. భారత చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నరు  ధర్మేంద్ర.  1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరా సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత షోలే, చుప్కే చుప్కే, యాదోం కీ బారాత్, సత్యకామ్, సీతా ఔర్ గీతా లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.  

ప్రస్తుతం కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందుతున్న రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహనీ సినిమాలో ధర్మేంద్ర నటిస్తున్నారు. ఈసినిమా లో ధర్మేంద్రతో పాటు  జయాబచ్చన్, షబానీ ఆజ్మీ, అలియా భట్, రణ్‌వీర్ సింగ్  లాంటి బాలీవుడ్ ప్రముఖులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ధర్మేంద్ర ప్రకటనతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. తమ అభిమాన నటుడు ఆరోగ్యంగా ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే