
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగులో ప్రారంభమైన టీవీ రియాల్టీ షో 'బిగ్ బాస్'. తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో ఇదో సరికొత్త, విభిన్నమైన షో కావడంతో రెస్పాన్స్ అదిరిపోతోంది. తొలి వారం టీఆర్పీ రేటింగుల్లో బిగ్ బాస్ షో దుమ్మురేపింది. ఈ షోకు ఇంత భారీ రెస్పాన్స్ రావడానికి కారణం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పక తప్పుదు. ఆయన హోస్ట్ కావడం వల్లనే ఈ షో తెలుగులో ఇంత పెద్ద హిట్టయిందని అంటున్నారు. ప్రముఖుల నుండి ఎన్టీఆర్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
తొలి వారం ‘బిగ్ బాస్' షో భారీ విజయం సాధించడంతో కంగ్రాట్స్ చెబుతూ నాగార్జున ట్వీట్ చేశారు. ‘కంగ్రాట్స్ తారక్. నీ ఎనర్జీ ఎంతో నచ్చింది. నీ వల్లే ఈ షో ఓపెనింగ్ వీక్ లో ఫెంటాస్టిక్ రేటింగ్స్ సాధించింది' అని నాగార్జున ట్వీట్ చేశారు. దానికి రిప్లై ఇచ్చిన జూనియర్.. థాంక్యూ బాబాయ్ ‘‘చాలా చాలా ధన్యవాదాలు బాబాయ్. మీరు నడిపించిన అలాంటి బాటలో నడిచేందుకు మాకు ఒక మార్గం వేసిన మీ గొప్ప ప్రయత్నం ఫలితమే అది'' అంటూ నాగార్జునకు రిప్లై ఇచ్చారు తారక్.
తనదైన శైలితో ఈ షోని మరింత ఆసక్తిగా రన్ చేస్తున్నారు ఎన్టీఆర్. వారంలో 5 రోజుల ఎపిసోడ్స్ కి 10.4 టీఆర్పీ రేటింగ్ వస్తే, శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ పాల్గొనే ఎపిసోడ్స్‌కి 16.18 రేటింగ్ వస్తోంది. దీంతో స్టార్ మా టీవీ గతవారం నెం.1 స్థానంలో నిలిచింది. బిగ్ బాస్ షోకి అత్యధికంగా 16.18 టీ.ఆర్.పీ రేటింగ్స్ రావడం హాట్ టాపిక్ అయింది. ‘మా' టీవీ.... ‘స్టార్ మా'గా మారిన తర్వాత 2017లో ఈ స్థాయిలో టీ.ఆర్.పీ అందుకోవడం ఇదే మొదటిసారి.
తొలుత బిగ్ బాస్ షోలో ఎంపికైన 14 మంది పోటీదారులను చూసిన చాలా మంది ప్రేక్షకులు వీరంతా చాలా యావరేజ్ సినీ స్టార్లని, వీరితో బిగ్ షో విజయవంతంగా నడిచే అవాకాశమే లేదనే విమర్శలు చేశారు. దీంతో బిగ్ బాస్ షో మొదట్లోనే నీరసపడిపోయే పరస్థితి వచ్చింది. ఎన్టీఆర్ వచ్చే సరికి మళ్లీ ప్రోగ్రాం మీద ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. అప్పటిదాకా నీరసంగా సాగుతున్న షో ఒక్కసారిగా ఊపందుకుని సంచలనం సృష్టించింది.