బుల్లితెర అరంగేట్రం చేస్తున్న ఎన్టీఆర్ కు స్టార్ మా భారీ ప్యాకేజ్

Published : May 31, 2017, 03:58 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
బుల్లితెర అరంగేట్రం చేస్తున్న ఎన్టీఆర్ కు స్టార్ మా భారీ ప్యాకేజ్

సారాంశం

బుల్లితెరపై అలరించనున్న జూనియర్ ఎన్టీఆర్ స్టార్ మా టీవీ బిగ్ బాస్ షో ద్వారా బుల్లితెర అరంగేట్రం బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించేందుకు జూనియర్ కు భారీ ప్యాకేజీ

సిల్వర్ స్క్రీన్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ... తమకంటూ ప్రత్యేకమైన అభిమాన గణాన్ని ఏర్పాటు చేసుకోవడం హీరోలకు సహజం. వారసత్వంగా వచ్చిన అభిమానమేకాక.. వరుసహిట్స్ తో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. జూనియర్ కున్న క్రేజ్, ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని.. స్టార్ మా టీవీ ఛానెల్ త్వరలో ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ షోను లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఎన్టీఆర్ షోను అధికారికంగా ప్రకటించిన మా ఛానెల్ టీఆర్పీ రేటింగ్స్ లో హిందీ బిగ్ బాస్ ఇచ్చిన సక్సెస్ నే తెలుగులో ఎన్టీఆర్ షో ద్వారా సంపాదించొచ్చని భావిస్తోంది. మరి మా ఛానెల్ కార్యక్రమాల గురించి తెలియంది కాదు.

 

ఇప్పటికే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో ద్వారా అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై మా టీవీలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాలను హోస్ట్ చేసినందుకుగాను నాగార్జున, చిరంజీవి భారీగా రెమ్యూనరేషన్ పుచ్చుకున్నారు. త్వరలో 'బిగ్ బాస్' తెలుగు వెర్షన్ రియాల్టీ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్న జూ ఎన్టీఆర్..... ఇప్పటి వరకు తెలుగు బుల్లితెర రంగంలో ఎవరూ తీసుకోనంత రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారట.

నాగార్జున, చిరంజీవిలు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' ద్వారా రూ. 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని, అయితే జూ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్' తెలుగు రియాల్టీ షోకు రూ. 7 కోట్ల తీసుకుంటున్నట్లు టాక్. భారీ మొత్తం ఇదే తొలిసారి తెలుగు బెల్లితెర రంగంలో ఒక హోస్ట్ కు రూ. 7 కోట్ల భారీ మొత్తం చెల్లించడం ఇదే తొలిసారి అని అంటున్నారు. జూ ఎన్టీఆర్ కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, స్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఇంత పెద్ద మొత్తం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా హిందీలో బాగా పాపులర్ అయిన రియాల్టీ షో 'బిగ్ బాస్' త్వరలో తెలుగులో కూడా ప్రసారం కాబోతోంది. తెలుగు వెర్షన్లో రాబోతున్న ఈ షోను టాలీవుడ్ యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నారు.

 

ఇటీవలే స్టార్ నెట్వర్క్‌ లో విలీనం అయిన 'మా టీవీ' తెలుగు వెర్షన్ 'బిగ్ బాస్'ను ప్రసారం చేయబోతోంది. ఈ షో ద్వారా తొలిసారిగా జూ ఎన్టీ బుల్లితెరపై ఎంట్రీ ఇస్తుండటం హాట్ టాపిక్ అయింది. బిగ్ బాస్ షోలో పాల్గొనే సెలబ్రెటీల ప్రవర్తన చాలా వివాదస్పదంగా ఉండటమే సక్సెస్ కు కారణం. మరి తెలుగులోనూ అదే తరహాలో వివాదాస్పదంగా ఈ షోను సాగిస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. హిందీలో బిగ్ బాస్ షోకు మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తుండటంతో తెలుగులో కూడా ఈ షోకు అదే తరహాలో స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్