జూనియర్ ఆర్టిస్ట్ సూసైడ్ కు అదే కారణమా?

Published : Jun 15, 2018, 03:58 PM IST
జూనియర్ ఆర్టిస్ట్ సూసైడ్ కు అదే కారణమా?

సారాంశం

జూనియర్ ఆర్టిస్ట్, వర్ధమాన సంగీత దర్శకుడు అనురాగ్ వినిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు

జూనియర్ ఆర్టిస్ట్, వర్ధమాన సంగీత దర్శకుడు అనురాగ్ వినిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జరిగి వారం రోజులు దాటితే ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అతడు ఆత్మహత్య చేసుకున్న స్థలం వివరాలపై కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

వికారాబాద్ లోని మర్పల్లిలో సూసైడ్ చేసుకున్నాడని కొందరు చెబుతుంటే.. నాగోల్ మమత నగర్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని మరికొందరు చెబుతున్నారు. అసలు అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం బయటకు పొక్కనివ్వడం కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. అతడికి డ్రగ్స్ అలవాటు ఉండేదని, దానికి బానిస కావడం వలనే సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

గత కొద్దిరోజులుగా కొందరు అనురాగ్ ను వేధింపులకు గురి చేస్తున్నారట. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనురాగ్ సూసైడ్ చేసుకొని ఉంటాడని అతడి స్నేహితులు చెబుతున్నారు. పలు లఘు చిత్రాలకు పని చేసి సినిమాలలో అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న సమయంలో అతడు ఇలా బలవన్మరణానికి పాల్పడడంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. 

PREV
click me!

Recommended Stories

వెంకటేష్ కొడుకు అర్జున్ ను హీరోగా పరిచయం చేయబోతున్న డైరెక్టర్ ఎవరో తెలుసా? నిజమెంత?
సౌత్ సినిమాలపై నోరు పారేసుకున్న హీరోయిన్, రాధికా ఆప్టే సంచలన కామెంట్స్ ..