'అరవింద సమేత'కు డేట్ ఫైనల్ అయినట్లే!

First Published 15, Jun 2018, 3:24 PM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత' అనే సినిమాలో నటిస్తోన్న 

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎటువంటి గ్యాప్ తీసుకోకుండా నాన్ స్టాప్ షూటింగ్ నిర్వహిస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు విడుదల చేయాలనేది ప్లాన్.

తాజాగా డేట్ ను కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 8 నుండే సెలవులు మొదలవుతుండడంతో 10న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఆరోజు బుధవారం పడింది. హిట్ టాక్ వస్తే ఆ వీకెండ్ లో సినిమా మరింత పుంజుకుంటుందని బుధవారం నాడే విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారు.

అయితే ఈ విషయం మాత్రం ఎన్టీఆర్ కు ఇంకా చెప్పలేదని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ తన భార్య ప్రణతితోనే ఉన్నాడు. నిన్న ఈ జంటకు మగ బిడ్డ పుట్టడంతో తారక్ తన భార్యకు తోడుగా హాస్పిటల్ లోనే ఉన్నాడని చెబుతున్నారు. మరో మూడు రోజుల పాటు ఆమెతోనే ఉండి ఆ తరువాత షూటింగ్ లో పాల్గొనున్నాడు. ఫ్యాక్షన్ డ్రాప్ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. 

Last Updated 15, Jun 2018, 3:24 PM IST