పబ్లిసిటీ కోసం పిటిషన్ వేస్తారా.. జూహీచావ్లాకు ఢిల్లీ హైకోర్టు షాక్, 20 లక్షల జరిమానా

By Siva KodatiFirst Published Jun 4, 2021, 6:51 PM IST
Highlights

అలనాటి బాలీవుడ్ నటి జూహీ చావ్లాకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. దేశంలో 5జీ నెట్‏వర్క్ ట్రయల్స్ వద్దంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. ఆమె ఫిర్యాదును తిరస్కరించింది. 

అలనాటి బాలీవుడ్ నటి జూహీ చావ్లాకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. దేశంలో 5జీ నెట్‏వర్క్ ట్రయల్స్ వద్దంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. ఆమె ఫిర్యాదును తిరస్కరించింది. దేశంలో టెక్నాలజీ అప్ గ్రేడ్ కావాలని వ్యాఖ్యానించింది. అలాగే కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ.. జూహీ చావ్లాకు రూ. 20 లక్షల జరిమానా విధించింది న్యాయస్థానం. అంతేకాకుండా.. కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో ఆమె అభిమాని ఒకరు పాటలు పాడటం.. అందుకు సంబంధించిన వీడియోను జూహీ చావ్లా సోషల్ మీడియాలో షేర్ చేయడంపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ విషయం గురించి కోర్టును ఆశ్రయించేకంటే ముందు ప్రభుత్వానికి లేఖ రాస్తే బాగుండేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ పిటిషన్ లో సరైన సమాచారం లేదని.. కేవలం పబ్లిసిటి కోసమే పిటిషన్ ధాఖలు చేశారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, దేశంలో 5జీ టెక్నాలజీ వలన తీవ్రమైన ప్రమాదాలు జరుగుతాయని.. ఈ టెక్నాలజీ వలన ఎలాంటి ప్రమాదం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.

Also Read:జూహీ చావ్లా ఫామ్ హౌస్ చూశారా..? ఎన్ని మామిడి పండ్లో..!

అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ధ్రువీకరణ లేఖ వచ్చేవరకు 5జీ నెట్‌వర్క్ ట్రయల్ ఆపాలని కోరుతూ.. జూహీ చావ్లా సహా మరో ఇద్దరు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు 5 వేల పేజీల ఈ పిటిషన్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లాంటి ఏజెన్సీలు సహా యూనివర్సిటీలు, ప్రపంచ ఆరోగ్య సంస్థను ప్రతివాదులుగా చేర్చారు. 

click me!