రహస్య వివాహం చేసుకున్న నితిన్ హీరోయిన్

Published : Jun 04, 2021, 06:10 PM IST
రహస్య వివాహం చేసుకున్న నితిన్ హీరోయిన్

సారాంశం

బాలీవుడ్ లో బిజీగా హీరోయిన్ గా రాణిస్తున్న యామి గౌతమ్ నేడు వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. 


కన్నడ బ్యూటీ ప్రణిత సుభాష్ ఇటీవల రహస్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి ఫోటోలు బయటికి వచ్చే వరకు తాను వివాహం చేసుకున్న విషయాన్ని వెల్లడించలేదు. ఆ తరువాత అధికారికంగా పెళ్లి గురించి సమాచారం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తాజాగా మరో హీరోయిన్ రహస్య వివాహం చేసుకున్నారు. 

 

బాలీవుడ్ లో బిజీగా హీరోయిన్ గా రాణిస్తున్న యామి గౌతమ్ నేడు వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. నిరాడంబరంగా మా వివాహం జరిగింది.మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ యామి గౌతమ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 


యామి ని పెళ్లాడిని వరుడు ఆదిత్య అని తెలుస్తుంది. వీరు చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. నేడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు ఈ జంట. ఇక తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధంతో పాటు నితిన్ కి జంటగా కొరియర్ బాయ్ కళ్యాణ్ మూవీలో యామి గౌతమ్ నటించారు. హిందీలో యామి వరుస చిత్రాలు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Demon Pavan : రీతూ తో జంటగా డీమాన్ పవన్ మరో స్పెషల్ షో, స్టేజ్ పై రెచ్చిపోయి రొమాన్స్ చేయబోతున్న జోడి.. నిజమెంత?
2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?