రామ్ చరణ్ - ఉపాసన తల్లిదండ్రులు కావడంతో మెగాఇంట పండగ వాతావరణం నెలకొంది. అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఆసక్తికరంగా విష్ చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - ఉపాసన కొణిదెల తల్లిదండ్రులుగా ప్రమోషన్ తీసుకున్నారు. మొన్నటి వరకు ఇండస్ట్రీలో బ్యూటీఫుల్ కపుల్ ఉన్న వీరు ప్రస్తుత బ్యూటీపుల్ పెరేంట్స్ గా మారిపోయారు. ఈ ఉదయమే వీరికి పండంటి ఆడబిడ్డ జన్మించింది. మహాలక్ష్మి పుట్టడంతో మెగా ఫ్యామిలీ పట్టలేని ఆనందంలో మునిగి తేలుస్తోంది. తమ సంతోషాన్ని ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే చిరంజీవి తన మనవరాలి రాకతో ఎంతో మురిసిపోతున్నారు. లిటిల్ మెగా ప్రిన్సెస్ అనే టైటిల్ తో స్వాగతం పలికారు. మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Mega Princess హ్యాష్ ట్యాగ్ ను దేశ వ్యాప్తంగా ట్రెండ్ చేస్తున్నారు. రామ్ చరణ్ కు ప్రాణ స్నేహితుడైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) మెగా ప్రిన్సెస్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్వీటర్ వేదిక చరణ్, ఉపాసనను విష్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘రామ్ చరణ్ - ఉపాసన మీకు నా శుభాకాంక్షలు. పెరేంట్స్ క్లబ్ లోకి మిమల్ని ఆహ్వానిస్తున్నాను. పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడం సంతోషంగా ఉంది. ఆడబిడ్డతో గడిపే ప్రతిక్షణం ఉంటుంది. దేవుడు ఆమెను, మీ అందరికీ మరింత సంతోషాన్ని అందించాలని ఆశిస్తున్నాను‘ అంటూ విష్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ చివరిగా ‘ఆర్ఆర్ఆర్’లో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. దీంతో వీరిద్దరూ గ్లోబల్ స్టార్స్ గాను గుర్తింపు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలోని ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక పండంటి ఆడబిడ్డ పుట్టడంతో కొద్దిరోజులు అన్నీ బిజీ షెడ్యూల్స్ ను వాయిదా వేశారని తెలుస్తోంది. పూర్తి సమయం ఫ్యామిలీకే కేటాయించేలా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది.
Congratulations and . Welcome to the parents club. Every moment spent with the baby girl will be an unforgettable memory for a life time. May God bless her and you all with immense happiness.
— Jr NTR (@tarak9999)