
సౌత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సంచలన ప్రకటన చేశారు. ఆయన త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు అనౌన్స్ చేశారు.అయితే త్వరలో అంటే వెంటనే కాదు.. కాని ఓ పది సినిమాలు చేసిన తరువాత ఆయన ఇండస్ట్రీ నుంచి తప్పుకోబోతున్నట్టు తెలుస్తోంది. పది సినిమాలు చేసిన తరువాత తాను ఫిల్మ్ మేకింగ్‌కు గుడ్‌బై చెబుతానని లోకేష్ స్పష్టం చేశారు.
ఖైదీ సినిమాతో సెన్సేషప్ క్రియేట్ చేశారు లోకేష్ కనగరాజ్.. ఆతరువాత కమల్ హాసన్ తో ఆయన చేసిన విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు.. బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నింటిని బ్రేక్ చేసింది. ప్రస్తుతం దథపతి విజయ్ తో.. రికార్డ్ బ్రేక్ చేయడం కోసం లియో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక తాజాగా హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంచలన ప్రకటన చేశారు.
లోకేష్ చేసిన ప్రకటనలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా వెల్లడించారు. హాలీవుడ్ లెజెండ్ క్వింటెన్ టరెంటినోను తాను ఫాలో అవుతున్నట్టు చెప్పుకొచ్చారు. తానూ పది సినిమాలు చేసిన తర్వాత ఫిల్మ్ మేకింగ్‌కు గుడ్‌బై చెబుతానన్నారు. ఇంతకీ లోకేష్ ఇంకా ఏమన్నారంటే.. నాకు లైఫ్ లాంగ్ ప్లానింగ్స్ ఏమీ లేవు.. ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలనీ లేదు. సినిమాలు తీయ్యడం కోసం ఇక్కడకు వచ్చాను.. కాని జీవితంతం ఇందులోనే ఉండిపోలేను అన్నారు.
ఏదో మొదట షార్ట్ ఫిల్మ్స్ తీశా... అది బాగుంది .. అందులో కాస్త పట్టుచిక్కాక దీన్నో వృత్తిగా స్వీకరించా. నేను పది సినిమాల వరకూ చేస్తా. ఆ తరువాత ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా. ఒక కథలో సినిమాటిక్ యూనివర్స్ సృష్టించడం అంత సులభమైన విషయం ఏమీ కాదు. ప్రతి సినిమాకు సంబంధించి నిర్మాత, సంగీత దర్శకుడి నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలి. నాతో పని చేసిన నిర్మాతలు, నటులకు ధన్యవాదాలు! వారి వల్లే సినిమాటిక్ యూనివర్స్ సాధ్యమైంది. ఎల్‌సీయూలో పది సినిమాలు వస్తాయేమో చూద్దాం. రెండోసారి విజయ్ అన్నతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు.