వైరల్ పిక్: చెట్టు కింద ఒంటరిగా కనిపించిన తారక్

Published : Sep 25, 2018, 05:09 PM IST
వైరల్ పిక్: చెట్టు కింద ఒంటరిగా కనిపించిన తారక్

సారాంశం

ఈ ప్రాజెక్ట్ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించడానికి చిత్ర యూనిట్ తరచు చెప్పేది. కానీ రీసెంట్ గా సెట్ లో తారక్ కు సంబందించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  చూస్తుంటే యంగ్ టైగర్ చాలా సైలెంట్ గా ఎదో ఆలోచనతో ఉన్నట్లు అనిపిస్తోందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

గత ఏడాది జై లవకుశ సినిమాతో మంచి హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ ఏడాది కూడా అరవింద సమేతతో అంతకంటే పెద్ద హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఎప్పటినుంచో తనకు ఇష్టమైన త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాలనీ అనుకుంటున్న తారక్ కు అరవింద సమేత ద్వారా ఆ కోరిక నెరవేరింది. ఇకపోతే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించడానికి చిత్ర యూనిట్ తరచు చెప్పేది. 

కానీ రీసెంట్ గా సెట్ లో తారక్ కు సంబందించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  చూస్తుంటే యంగ్ టైగర్ చాలా సైలెంట్ గా ఎదో ఆలోచనతో ఉన్నట్లు అనిపిస్తోందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అరవింద సమేత షూటింగ్ ఇటలీ లో జరుగుతోంది. అయితే సాధారణంగా హీరోలు షూటింగ్ సమయాల్లో ఈ విధంగా కనిపించరు. 

కానీ తారక్ కి కాస్త గ్యాప్ దొరక్కగానే ప్రశాంతంగా కూర్చున్నట్లు చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. ఎలాంటి హడావుడి లేకుండా ఒక చెట్టు కింద ఏకాంతంగా కూర్చోవడం నందమూరి అభిమానులను కూడా ఆకట్టుకుంటోంది. ఇక అరవింద సమేత షూటింగ్ దాదాపు ఎండింగ్ కు వచ్చేసినట్లు తెలుస్తోంది. డబ్బింగ్ పనులను కూడా ఫినిష్ చేశారు. సినిమాను అక్టోబర్ 11న రిలీజ్ చెయ్యాలని నిర్మాత రాధా కృష్ణ సన్నాహకాలు చేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Satluj OTT Release: 25000 మిస్సింగ్ కేసుల కథ, సెన్సార్ కష్టాలతో ఏళ్ల తరబడి వాయిదా..ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్
Alpha OTT Release: ఆలియా 'ఆల్ఫా' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?