మంచి మనసు చాటుకున్న మెగా పవర్ స్టార్.. చిన్నారి కళ్ళలో ఆనందం నింపిన రామ్ చరణ్

Published : Feb 10, 2023, 09:54 AM IST
మంచి మనసు చాటుకున్న మెగా పవర్ స్టార్.. చిన్నారి కళ్ళలో ఆనందం నింపిన రామ్ చరణ్

సారాంశం

మరోసారి మంచి మనసు చాటుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారి అభిమాని కోరిక తీర్చి.. చిన్నారి కళ్ళలో ఆనందం నింపారు చరణ్.   


తమను ప్రాణం కంటే అభిమానించే ఫ్యాన్స్ కోసం.. ఆపన్న హస్తం అందించడానికి రెడీగా ఉంటారు కొంత మంది స్టార్స్. అందులో మెగా హీర్లు అయితే అభిమానులు ఇబ్బందులో ఉంటే.. పరుగుపరుగున వస్తారు. అంతే కాదు అనారోగ్యంతో బాధపడుతూ.. తమ అభిమాన  హీరోను చూడాలని ఆరాటపడుతున్న ఎందరో అభిమానులను కలుసుకుని వారికి ఓదార్పునిచ్చి.. ధైర్యాన్ని ఇస్తుంటారు హీరోలు.. చిరంజీవి, బాలయ్య, ఎన్టీఆర్, మహేష్.. ఇలా పెద్ద పెద్ద స్టార్స్ అంతా తమ అభిమానులకు ఏదో ఒక సందర్భంలో ఇలా ధైర్యం చెప్పినవారే. రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన వీరాభిమాని కళ్లళ్ళలో ఇలానే సంతోషం నింపాడు. 

కాన్సర్ తో పోరాడుతున్ తన అభిమాని కోసం పరుగుపరుగున వచ్చాడు చరణ్ భావు. ఫ్యాన్ అంటే ఏ కాలేజ్ కుర్రాడో కాదు.. 9 ఏళ్ళ బాబు. రామ్ చరణ్ అంటే ఎంతో అభిమానం ఉన్న ఆ చిన్నారి కాన్సర్ తో పోరాటం చేస్తున్నాడు. అంత బాధలోనూ... తన అభిమాన నటుడు చరణ్ ను చూడాలని అనుకున్నాడు. ఆ విషయం తెలిసిన రామ్ చరణ్ కూడా పరుగుపరుగున చిన్నారి వద్దకు చేరాదు..ఆప్యాయంగా మాట్లాడీ ధైర్యం చెప్పాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

 

ఇక వివరాల్లోకి వెళ్తే.. మణికౌశల్ అనే పిల్లాడు క్యాన్సర్ తో  పోరాడుతున్నాడు. హాస్పిటల్ లో బెడ్ పై కదల్లేని పరిస్థితుల్లో ఉన్నాడు.  ఈ విషయం తెలసుకున్న మేక్ ఏ విష్ ఫౌండేషన్ వారు  రామ్ చరణ్ కి పరిస్థితిని  చేరవేయగా.. వెంటనే తన అభిమానిని కలిసి.. తన కళ్ళలో ఆనందం చూడాలని వచ్చాడు మెగాహీరో. అలా బుడ్డోడి కలిసి చాలా టైమ్ స్పెండ్ చేశారు చరణ్.  మణికౌశల్ తో సరదాగా ఆ ముచ్చటించడంతో పాటు.. అతని కి ఓ మంచి  గిఫ్ట్ కూడా ఇచ్చాడు చరణ్. దీంతో అభిమాన హీరోని చూసేసరికి ఆ పిల్లాడు  సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. 

చిన్నారికోసం మెగా పవర్ స్టార్ రావడం.. అతనిలో ధైర్యాన్ని నింపడంతో.. తల్లితండ్రులతో పాటు.. ఫ్యాన్స్.. ఆడియన్స్.. నెటిజన్లు అంతా హర్షం  వ్యక్తం చేస్తున్నారు. మెగా పవర్ స్టరా్ మంచి మనసుకు హ్యాట్సాఫ్ చెపుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ చిన్నారిని కలిసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఎప్పటిలాగానే నెటిజన్లు రకరకాల కామెంట్లతో నింపేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..
Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్