
ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ, గోవిందరాజులు పిల్లలు ఇచ్చిన బట్టలు కట్టుకునే అక్కడికి రావడంతో ఇంతలో పిల్లలందరూ అక్కడికి వచ్చి అమ్మానాన్న ఈ బట్టల్లో చాలా అందంగా ఉన్నారు పెళ్లిరోజుల్లో కూడా ఇలాగే ఉండి ఉంటారు అని అంటారు. ఆ తర్వాత రామచంద్ర, జానకి అందరు కలిసి గోవిందరాజులు, జ్ఞానాంబని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తారు. ఆ తర్వాత ఏంటి రా ఈ ఏర్పాట్లు అని అనడంతో మీరు ఒప్పుకోలేదు కాబట్టి సరిపోయింది ఒప్పుకొని ఉంటే రామచంద్ర గారు కళ్యాణ మండపం బుక్ చేయాలి అనుకున్నారు అంటుంది జానకి.
ఆ తర్వాత జ్ఞానాంబ గోవిందరాజులు ఇద్దరు కలిసి దండలు మార్చుకుంటారు. అప్పుడు అందరూ సంతోషపడుతూ ఉంటారు. తరువాత గోవిందరాజులు, జ్ఞానాంబల దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి పూలు వేసి జ్ఞానాంబ వాళ్లకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పడంతో వాళ్ళందరిని చూసి జ్ఞానాంబ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు రామచంద్ర ఏంటమ్మా ఇది అని అంటాడు. వెంటనే జ్ఞానాంబ ఇవి కన్నీళ్లు కావు ఆనందభాష్పాలు అని అంటుంది. వద్దనుకున్న మా పెళ్ళి రోజునే మళ్లీమళ్లీ జరిపించుకునేలా చేశారు అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ కొడుకు కోడళ్ళకు మంచి మాటలు చెబుతూ ఉంటుంది.
భార్యాభర్తల బంధం గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది జ్ఞానాంబ. తరువాత గోవిందరాజులు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. గోవిందరాజులు కన్నీళ్లు పెట్టుకోవడంతో ఇలా బాధపడకండి మామయ్య గారు మీరు ఎప్పుడు పార్వతీ పరమేశ్వరుల్లా ఆనందంగా ఉండాలి అంటుంది జానకి. రామచంద్ర మేమందరం మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాము కానీ మీ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఒక ప్రత్యేకమైన అతిథి వచ్చింది అని అంటాడు రామచంద్ర. ఎవరు రా అని గోవిందరాజులు అడగగా తిలోత్తమా పిన్ని అని అనగా ఇంతలోనే అక్కడికి ఆమె వస్తుంది. అప్పుడు గోవిందరాజులు ఆమెతో గతంలో గడిపిన క్షణాల గుర్తు చేర్చుకొని ఈ సాంగు వేసుకోవడంతో జ్ఞానాంబ నవ్వుకుంటూ ఉంటుంది.
అప్పుడు అందరి ముందు గోవిందరాజులని రాజా అనడంతో గోవిందరాజులు సిగ్గుపడుతూ ఉంటాడు. అప్పుడు ఆమె హడావిడి చేస్తూ అందరితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అందరు సంతోషపడుతూ ఉంటారు. అయినా ఇక్కడ ఏం జరుగుతోంది అనడంతో మల్లిక మీరు ఎందుకు వచ్చారో అదే జరుగుతోంది అనగా నీకు సెటైర్లు వేయడం కూడా వచ్చా అని అంటుంది. అత్తయ్య గారి పెళ్లి రోజు జరుపుతున్నాము అని జానకి అనడంతో మరి ఇలా మౌనంగా ఉండాలి ఏంటి అందురు హ్యాపీగా ఉండాలి కదా అని అంటుంది. అప్పుడు తిలోత్తమా మలయాళం కి చెప్పి పాట వేయించడంతో విష్ణు మల్లిక ఇద్దరు కలిసి సంతోషంగా డాన్స్ చేస్తూ ఉంటారు.
అది చూసి అందరూ సంతోష పడుతూ ఉంటారు. తర్వాత తిలోత్తమా గోవిందరాజులు దంపతులను డాన్స్ చేయమని చెబుతుంది. అప్పుడు మేము చేయలేము అని అనగా అందరూ చేయాలి అనగా తప్పక వాళ్లిద్దరూ కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. అది చూసి అందరూ సంతోష పడుతూ ఉంటారు. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేయడానికి కూర్చుంటారు. అప్పుడు అందరూ కలిసి భోజనం చేస్తుండగా తిలోత్తమా అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. ఈరోజు అమ్మ నాన్నల పెళ్లి చేసినట్లే రేపు వెన్నెల పెళ్లి కూడా చేస్తాము అని రామచంద్ర అనగా పెళ్లి రోజుకి 5000 వసూలు చేశారు ఇక పెళ్లికి ఎంత వసూలు చేస్తారో ఆలోపు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటుంది మల్లిక. అప్పుడు చేతులు కడుక్కోవడానికి వెళ్లగా జానకి కళ్ళు తిరిగి పడిపోతుంది.