ఆ వైరల్ న్యూస్ పై స్పందించిన సమంత టీం? ఏమంటున్నారంటే?

By Asianet News  |  First Published Feb 18, 2023, 9:44 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఆరోగ్యం ఇప్పుడిప్పుడే మెరుగవుతోంది. ఈ క్రమంలో సమంత గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది. దానికి తాజాగా సమంత టీమ్ స్పందించినట్టు తెలుస్తోంది. 
 


తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ సమంత. కేరీర్ ప్రారంభం నుంచి తన కేరీర్ ను చాలా బిల్డ్ చేసుకుంటున్నారు ఆమె. ప్రస్తుతం ఇండియాలోనే అగ్రస్థాయిలో హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకున్నారు. అయితే, అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత పూర్తిగా కేరీర్ పైనే శ్రద్ధ వహిస్తున్నారు. చిన్న గ్యాప్ తర్వాత ‘పుష్ప’ చిత్రంలో  స్పెషల్ అపియరెన్స్ తో అలరించిన విషయం తెలిసిందే. ‘ఊ అంటావా మావా’ సాంగ్ తో ఇండియాను షేక్ చేశారు సమంత. ఈ సాంగ్ ఇప్పటికీ సౌండ్ బాక్సుల్లో మోగుతూనే ఉంది. 

అయితే ఈపాటతో సమంతకు ఇండియా వైడ్ గా క్రేజ్ రావడంతో పాటు Pushpa చిత్రానికి కూడా బాగా ప్లస్ అయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే.  రీసెంంట్ గా వైజాగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే Pushpa2లోనూ సమంతకు మళ్లీ ఆఫర్ వచ్చిందనే వార్తలు ఇటీవల నెట్టింట బాగా చక్కర్లు కొట్టాయి. మరోసారి స్పెషల్ సాంగ్ కోసమే చిత్ర యూనిట్ సమంతను సంప్రదించినట్టు, ఇందుకు సామ్ నో చెప్పినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా సమంత టీమ్ స్పందించినట్టు తెలుస్తోంది.

Latest Videos

ఇంతకీ సమంతకు ‘పుష్ప2’ నుంచి  ఎలాంటి ఆఫర్ అందలేదని వారు చెప్పినట్టు సమాచారం. ఈ  వైరల్ న్యూస్ లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఇక సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ నుంచి కోలుకుంటున్నారు. ఇప్పటికే మెరుగైన చికిత్స  తీసుకోగా.. ప్రస్తుతం ఇంట్లోనూ ట్రీట్ మెంట్ ను కొనసాగిస్తున్నారు. మరోవైపు తన ప్రాజెక్ట్స్ పైన ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. స్పై థ్రిల్లర్ సిరీస్ ‘సిటాడెట్ ఇండియన్ వెర్షన్’లో సమంత నటిస్తున్నవిషయం తెలిసిందే. షూటింగ్ కొనసాగుతోంది. 

రీసెంట్ గా విడుదలైన ‘యశోద’ చిత్రంతో సమంత బ్టాక్ బాస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక గుణశేఖర్ దర్శకత్వంతో సమంత నటించిన మరో భారీ ప్రాజెక్ట్ ‘శాకుంతలం’. ఈశివరాత్రి సందర్భంగా విడుదల కావాల్సిన చిత్రం వాయిదా పడింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుండటంతో పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నారు. అదేవిధంగా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’లోనూ నటిస్తున్నారు సమంత. మరికొద్దిరోజుల్లో షూటింగ్ లోనూ పాల్గొననున్నారు. 

click me!