బండ్ల గణేష్‌తో విభేదాలపై స్పందించిన జీవిత రాజశేఖర్‌..

Published : Sep 05, 2021, 03:44 PM IST
బండ్ల గణేష్‌తో విభేదాలపై స్పందించిన జీవిత రాజశేఖర్‌..

సారాంశం

ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌లో ఉన్న బండ్ల గణేష్‌ ఆ ప్యానెల్‌ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే తాను జనరల్‌ సెక్రెటరీ పదవికి పోటీ చేస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. అయితే ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌లోకి జీవిత రావడం ఆయనకు నచ్చలేదని, అందుకే పోటీలో దిగుతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీనిపై జీవిత రాజశేఖర్‌ స్పందిచారు.

బండ్ల గణేష్‌ వరుస ట్వీట్లు `మా` ఎన్నికలను హాట్‌ టాపిక్‌గా మార్చాయి. మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో `మా` ఎన్నికల విషయంలో చర్చనీయాంశంగా మారింది. ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌లో ఉన్న బండ్ల గణేష్‌ ఆ ప్యానెల్‌ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే తాను జనరల్‌ సెక్రెటరీ పదవికి పోటీ చేస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. అయితే ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌లోకి జీవిత రావడం ఆయనకు నచ్చలేదని, అందుకే పోటీలో దిగుతున్నట్టు ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో దీనిపై జీవిత రాజశేఖర్‌ స్పందిచారు. బండ్ల గణేష్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపింది. తాజాగా జీవిత ఓ మీడియాతో ముచ్చటిస్తూ, `మా`లో సభ్యులుగా ఉన్న ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయొచ్చని తెలిపింది. ఆమె చెబుతూ, `మా` అనేది అందరిది. ఇక్కడ ఎవరి మధ్య పోటీ లేదు. ప్యానెల్‌లో ఉన్నవాళ్లే ఎన్నికల్లో పోటీ చేయాలి? ప్యానల్‌లో లేనివాళ్లు పోటీ చేయకూడదు అనేది లేదు. సభ్యులుగా ఉన్న వాళ్లు ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. 

`మా` అభివృద్ధి కోసం పాటుపడాలనే ఆలోచన అందరిలో ఉంది. బండ్ల గణేశ్‌ కూడా `మా` అభివృద్ధి కోసం కృషి చేయాలనుకుంటున్నారు. అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అంతేకానీ, నాకు వ్యతిరేకంగా ఆయన పోటీ చేస్తున్నారని నేను భావించడం లేదు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేమంతా ఒక్కటే. మేమంతా కలిసే పనిచేస్తాం.  ఈ ఎన్నికల్లో నేను గెలిచినా, ఓడినా `మా` అభివృద్ధి కోసం పనిచేస్తా` అని జీవితా రాజశేఖర్‌ అన్నారు.

ప్రస్తుతం వీకే నరేష్‌ అధ్యక్షులుగా ఉన్న ప్రస్తుత కమిటీలో జీవిత రాజశేఖర్‌ జనరల్‌ సెక్రెటరీగా ఉన్నారు. మళ్లీ ఆమె అదే పోస్ట్ కి పోటీ చేయడం విశేషం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి
ఆరేళ్ల పాటు సహజీవనం చేసి, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక నిశ్చితార్థం చేసుకున్న నటుడు