బ్రేకింగ్‌ న్యూస్‌ః బండ్ల గణేష్‌ సంచలన ప్రకటన.. `మా` ఎన్నికల్లో పోటీ.. జీవితకి ఎసరు

Published : Sep 05, 2021, 02:50 PM IST
బ్రేకింగ్‌ న్యూస్‌ః బండ్ల గణేష్‌ సంచలన ప్రకటన.. `మా` ఎన్నికల్లో పోటీ.. జీవితకి ఎసరు

సారాంశం

 కొద్ది సేపటి క్రితమే ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన ఆయన కొద్ది గ్యాప్‌తోనే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ప్రకాష్‌రాజ్‌కే కాదు.. ఆర్టిస్టులందరికి మతిపోయేలా ఓ సంచలన ట్వీట్‌ పెట్టాడు బండ్ల గణేష్‌.

సంచలన నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ ఏం చేసినా సంచలనమే అన్నట్టు.. మరో సంచలనానికి తెరలేపాడు. ఆయన `మా` ఎన్నికల్లో మరో బిగ్‌ బ్రేకింగ్‌కి తెరలేపాడు. `మా` ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. కొద్ది సేపటి క్రితమే ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన ఆయన కొద్ది గ్యాప్‌తోనే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ప్రకాష్‌రాజ్‌కే కాదు.. ఆర్టిస్టులందరికి మతిపోయేలా ఓ ట్వీట్‌ పెట్టాడు. తాను `మా` ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. 

అయితే తాను జనరల్‌ సెక్రెటరీ పదవికి పోటీ చేస్తున్నట్టు ఆయన ప్రకటించడం ఇప్పుడు ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ని కలవరపాటుకి గురి చేస్తుంది. ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌లో జనరల్‌ సెక్రెటరీ పదవికి జీవిత రాజశేఖర్‌ పోటీలో ఉన్నట్టు ప్రకటించారు. కానీ బండ్ల గణేష్‌ మాత్రం తాను సైతం పోటీకి దిగబోతున్నట్టు వరుస ట్వీట్ల ద్వారా ప్రకటించారు. 

`మాట తప్పను ... మడమ తిప్పను. నాది ఒకటే మాట-ఒకటే బాట. నమ్మడం -నమ్మినవారికోసం బతకడం. నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను. నేను ఎవరిమాట వినను. త్వరలో జరిగే `మా` ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీగా పోటీ చేస్తా. పోటీ చేసి ఘన విజయం సాధిస్తాను` అని ఓ ట్వీట్ వదిలి షాకిచ్చాడు. 

దీనికి కొనసాగింపుగా ఆయన చెబుతూ, `మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు. నన్ను పోటీ చెయ్ అంటోంది. అందుకే ఈ పోటీ. అందరికీ అవకాశం ఇచ్చారు. ఒకేఒక అవకాశం నాకివ్వండి. నేనేంటో చూపిస్తా. నా పరిపాలన ఏంటో తెలియచేస్తా. వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం. దానికోసం పోరాడతా... వారి సొంత ఇంటి కల నిజం చేస్తా. 

ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమి చేయలేదు. ఇప్పుడు చేస్తామంటే మా సభ్యులు నమ్మరు. గొడవలతో మా సభ్యులను మోసం చేసింది చాలు. ఇక అలా జరగొద్దు. అందరి ఆశీస్సులు కావాలి. మాను  బలోపేతం చేద్దాం. ముఖ్యంగా పేద కళాకారులకు ఇళ్ళ కల నిజం చేద్దాం. అదే మా నిజమైన అభివృద్ధి... చిహ్నం - ఇట్లు మీ బండ్ల గణేష్` అంటూ వరుస ట్వీట్లు చేశారు.

ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌లో బండ్ల గణేష్‌ పేరు లేకపోవడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ నుంచి తప్పుకుని ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అంటున్నారు. ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌లోకి జీవితాని తీసుకోవడం బండ్లకి ఇష్టం లేదని ఆయన తాజా ప్రకటన స్పష్టం చేస్తుంది. అది కూడా బండ్ల గణేష్‌ ఈ సంచలన ప్రకటనకి కారణం కావచ్చని అంటున్నారు. మొత్తానికి బండ్ల గణేష్‌ ఎంట్రీతో `మా` ఎన్నికలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి
ఆరేళ్ల పాటు సహజీవనం చేసి, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక నిశ్చితార్థం చేసుకున్న నటుడు