`మా` ఎన్నికలుః ప్రకాష్‌ రాజ్‌కి నో చెప్పిన బండ్ల గణేష్‌.. ఇదేం ట్విస్ట్..

Published : Sep 05, 2021, 02:25 PM IST
`మా` ఎన్నికలుః ప్రకాష్‌ రాజ్‌కి నో చెప్పిన బండ్ల గణేష్‌.. ఇదేం ట్విస్ట్..

సారాంశం

ప్రకాష్‌ రాజ్‌కి వెన్నుదన్నుగా ఉన్న బండ్ల గణేష్‌ ఇప్పుడు షాకిచ్చాడు. ప్రకాష్‌రాజ్‌కి నో చెప్పాడు. తాను ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌ మీడియా ప్రతినిధుల్లో ఒకరిగా ఉన్న బండ్ల గణేష్‌ ఆ పోస్ట్ కి తాను న్యాయం చేయలేనని తెలిపారు. 

`మా` ఎన్నికల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. `మా` అధ్యక్ష బరిలో ఉన్న జీవిత రాజశేఖర్, హేమలు.. ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌లోకి వచ్చేశారు. ప్రకాష్‌ రాజ్‌కి వెన్నుదన్నుగా ఉన్న బండ్ల గణేష్‌ ఇప్పుడు షాకిచ్చాడు. ప్రకాష్‌రాజ్‌కి నో చెప్పాడు. తాను ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌ మీడియా ప్రతినిధుల్లో ఒకరిగా ఉన్న బండ్ల గణేష్‌ ఆ పోస్ట్ కి తాను న్యాయం చేయలేనని తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు బండ్ల గణేష్‌. 

`గౌరవనీయులైన ప్రకాష్‌రాజ్‌గారు. నన్ను అధికార ప్రతినిధిగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. నా వ్యక్తిగత కారణాల వల్ల ఆ పదవిని నేను నిర్వర్తించలేను. దానికి న్యాయం చేయలేను. దయజేసి ఆ పదవికి వేరే వ్యక్తిని ఎంచుకోగలరు. మీ టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్` అని పేర్కొన్నారు బండ్ల గణేష్‌. గతంలో తన ప్యానెల్‌ ప్రకటిస్తూ ప్రకాష్‌రాజ్‌ పెట్టిన ప్రెస్‌మీట్‌లో బండ్ల గణేష్‌ కీలక పాత్ర పోషించారు. ప్రకాష్‌రాజ్‌కి సపోర్ట్ గా, మీడియాకి సమాధానాలు చెప్పారు. ప్రకాష్‌ రాజ్‌ తర్వాత పెద్ద వాయిస్‌గా ఉన్నారు. 

కానీ ఇప్పుడు బండ్ల గణేష్‌ ప్రకాష్‌రాజ్‌కి హ్యాండివ్వడం ఆశ్చర్యానికి, అనేక సందేహాలకు తావిస్తుంది. ప్రకాష్‌ రాజ్‌ లేటెస్ట్ గా ప్రకటించిన ప్యానెల్‌లో బండ్ల గణేష్‌ పేరు లేదు. దీంతో ఆయన మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక బండ్ల గణేష్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. ఆ సినిమా బిజీలో ఉండటం వల్ల తాను `మా` ఎన్నికలకు సంబంధించి ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌కి న్యాయం చేయలేనని విరమించుకున్నారా? అన్నది సస్పెన్స్ గా మారింది. వాస్తవ కారణాలు తెలియాల్సి ఉంది. 

ఇక `మా` ఎన్నికలు అక్టోబర్‌ 10న నిర్వహించనున్నట్టు ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌, ఆయన కమిటీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా నెల రోజులకుపైగా టైముంది. ఈ నేపథ్యంలో ముందుగానే ప్రకాష్‌రాజ్‌ తన ప్యానెల్‌లో మార్పులు చేసి `సినిమా బిడ్డలు` పేరుతో కొత్త ప్యానెల్‌ని అధికారికంగా ప్రకటించారు. ఇందులో మీడియా ప్రతినిధులుగా బండ్ల గణేష్‌,జయసుధ, సాయకుమార్‌లు ఉంటారని మొన్న జరిగిన ప్రెస్‌మీట్‌లో ప్రకాష్‌ రాజ్‌ తెలిపిన విషయం తెలిసిందే.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి
ఆరేళ్ల పాటు సహజీవనం చేసి, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక నిశ్చితార్థం చేసుకున్న నటుడు