
గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో విలన్ గా కమెడియన్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరిస్తున్న జయప్రకాశ్ నారాయణ గుర్తింపును దక్కించుకున్నారు. గత 20 ఏళ్ళుగా సినీ, టి.వి., సాంస్కృతిక రంగాల్లో విశిష్ట ప్రతిభను కనబరుస్తున్న ఆర్టిస్ట్ లకు ఫిలిం ఎనలిటికల్ అండ్ అప్రిషియేషన్ సొసైటీ(ఫాస్) సన్మానం జరుపుతోంది.
ఇక ఈ ఏడాది కూడా ఫాస్-అక్కినేని 2018 అవార్డు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇక అవార్డుల విషయానికి వస్తే.. ఫాస్-అక్కినేని 2018 లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు జయప్రకాశ్ రెడ్డి గారిని వారించగా.. ప్రతిభా పురస్కారాన్ని ప్రముఖ నటుడు సంపూర్ణేష్‌బాబుకి అందించి సత్కరించనున్నారు.
ఇక స్పెషల్ అవార్డును మాణిక్ ను వరించింది. ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని సెప్టెంబర్ 30 ఆదివారం సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఇక ముఖ్య అతిధులుగా విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్ మరియు ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు హాజరుకానున్నారు.