
అక్కినేని నాగార్జున, నాని కలిసి నటించిన 'దేవదాస్' సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మొదటి షో నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. సెకండ్ హాఫ్ కాస్త స్లో అయినప్పటికీ ఓవరాల్ గా ఈ సినిమా మెప్పిస్తుంది.
అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ వస్తుండడంతో బయ్యర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఈ సినిమా పెద్ద ఎత్తున రిలీజైంది. నాగార్జున, నాని కెరీర్ లలో ఇదే హయ్యెస్ట్ రిలీజ్. దాదాపు 180 లోకేషన్స్ లో సినిమాను విడుదల చేశారు. ఒక్క ప్రీమియర్ షోల ద్వారా ఈ సినిమా 159, 079 డాలర్లను రాబట్టిందని సమాచారం.
మరికొన్ని లోకేషన్స్ నుండి ఇంకా రిపోర్ట్స్ అందాల్సివుంది. కొన్ని లోకేషన్స్ లోనే ఈ సినిమా ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టింది. అమెరికా ప్రీమియర్ కలెక్షన్లు.. నాగార్జున కెరీర్ లో హయ్యెస్ట్ కాగా.. నాని కెరీర్ లో ఇది నాల్గవ బెస్ట్ ఓపెనింగ్స్. నాగార్జున-నాని మధ్య కామెడీ ట్రాక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ వీకెండ్ లో సినిమా ఇంకెన్ని వసూళ్లను రాబడుతుందో చూడాలి!
ఇది కూడా చదవండి..