మా అనుభవం ముందు నువ్వెంత..? సీనియర్ కెమెరామెన్ తో డైరెక్టర్ కష్టాలు!

Published : Sep 27, 2018, 05:27 PM IST
మా అనుభవం ముందు నువ్వెంత..? సీనియర్ కెమెరామెన్ తో డైరెక్టర్ కష్టాలు!

సారాంశం

సినిమా ఇండస్ట్రీలో కొత్త దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. తమ ప్రతిభతో విజయాలు అందుకుంటున్నారు. ఒక్క హిట్టు కొట్టిన కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు. అయితే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే దర్శకులకు మాత్రం మొదట్లో ర్యాగింగ్ తప్పదనే చెప్పాలి. 

ముఖ్యంగా అనుభవం ఉన్న నిర్మాతలు, కెమెరా మెన్, హీరోల డామినేషన్ ని కొత్త దర్శకులు భరించాల్సిందే. తాజాగా ఓ కొత్త దర్శకుడు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడని సమాచారం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నూతనదర్శకుడు శ్రీనివాస్ ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. దీనికి కెమెరామెన్ గా చోటా కే నాయుడు వ్యవహరిస్తున్నాడు.

ఆయనకి ఇండస్ట్రీలో ఉన్న పేరు ప్రతిష్టల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకున్న అనుభవం తన సినిమాకు హెల్ప్ అవుతుందనుకున్న దర్శకుడు శ్రీనివాస్ కి ఇప్పుడు కొత్త తలనొప్పులు మొదలయ్యాయని సమాచారం. డైరెక్టర్ గా తన ఆలోచనలను పక్కన పెట్టి చోటా తన సొంత తెలివితో తనకు నచ్చినట్లుగా  సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట. దీంతో శ్రీనివాస్ అతడికి అడ్డుపడితే మా అనుభవం ముందు నువ్వెంత..? అన్నట్లుగా మాట్లాడుతున్నారని వినికిడి. మరి ఈ విషయాలన్నీ హీరో వరకు చేరాయో..? లేదో..?

PREV
click me!

Recommended Stories

Celebrity brothers: ఒకరు సూపర్ స్టార్, మరొకరు ఫ్లాప్ స్టార్.. ఇండియన్ సినిమాలో సెలెబ్రిటీ బ్రదర్స్ వింత కథ!
Balakrishna: బాలయ్య గురించి గుండెలపై చేయి వేసుకుని చెప్పిన డైరెక్టర్.. ఆమె వల్లే మళ్ళీ స్టార్ట్ చేశా