బోయపాటి,బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ టైటిల్ జయజానకినాయక

Published : Jun 17, 2017, 08:42 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
బోయపాటి,బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ టైటిల్ జయజానకినాయక

సారాంశం

బోయపాటి,బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ టైటిల్ జయజానకినాయక కథకు తగ్గట్టుగా ఉండాలనే ఈ టైటిల్ అంటున్న బోయపాటి ద్వారకా క్రియేషన్స్ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తున్న మిర్యాల రవీందర్‌రెడ్డి  

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘జయ జానకి నాయక’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. రకుల్‌ ప్రీత్ సింగ్‌, ప్రగ్యా జైస్వాల్‌, కేథరిన్ నాయికలు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో టైటిల్‌ లోగోను ఆవిష్కరించారు.

 

‘‘కథకు తగ్గట్టు ఉండాలనే మా చిత్రానికి ‘జయ జానకి నాయక’ అనే టైటిల్‌ను పెట్టాం. క్యూట్‌ లవ్‌స్టోరీతో తెరకెక్కించాం. అన్ని రకాల భావోద్వేగాలుంటాయి. ఆబాలగోపాలం ఒకే వరుసలో కూర్చుని చూసే సినిమా అవుతుంది’’ అని బోయపాటి శ్రీను అన్నారు.

 

నిర్మాత మాట్లాడుతూ ‘‘బోయపాటిగారి కథ మీద నమ్మకంతో అడిగినవన్నీ సమకూర్చాం. టాకీ పూర్తయింది. ఓ పాట, మూడు రోజుల ప్యాచ్ వర్క్‌ మిగిలి ఉంది. ఈ నెలాఖరుకు ప్యాచ్ వర్క్‌ పూర్తి చేసి, రీరికార్డింగ్‌ మొదలుపెడతాం. జులై 11నుంచి పాట చిత్రీకరిస్తాం. ఆగస్ట్‌ 11న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు. హీరో మాట్లాడుతూ ‘‘బోయపాటిగారు ఇచ్చిన సపోర్ట్‌, ఎనర్జీ మర్చిపోలేను. నిర్మాత రాజీపడకుండా సినిమా చేశారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం మెప్పిస్తుంది. సినిమా అందరి అంచనాలను మించి వంద రెట్లు కాదు.. వెయ్యి రెట్లు బావుంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రంలో తాను జానకి పాత్రలో నటిస్తున్నట్టు రకుల్‌ ప్రీత్ సింగ్‌, మంచి యూనిట్‌తో పనిచేసినట్టు శరత్ కుమార్‌ అన్నారు.

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం
Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్