
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోన్న రకుల్ ప్రీత్‌సింగ్.. ప్రస్తుతం మహేశ్ సరసన 'స్పైడర్' సినిమాతో పాటు బోయపాటి దర్శకత్వంలో 'జయ జానకి నాయక'లోనూ నటిస్తోంది. మరోవైపు కోలీవుడ్‌లోనూ బిజీ అవుతోన్న రకుల్.. ఇప్పుడు ఓ బాలీవుడ్ సినిమాకు సైన్ చేసిందట.
గతంలో 'యారియన్' అనే హిందీ చిత్రంలో నటించిన రకుల్.. ఈ సారి 'ఆయీయారీ' అనే మూవీతో మరోసారి బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంటోంది. నీరజ్ పాండే దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా నటించనుందట రకుల్. అతి త్వరలో రకుల్ ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అవనుండగా.. వచ్చే ఏడాది రిపబ్లిక్ డేకు ఈ సినిమా విడుదల కానుంది.