గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కంప్లీట్ చేసిన జాతిరత్నాలు బ్యూటీ..

By Mahesh JujjuriFirst Published Dec 26, 2021, 12:52 PM IST
Highlights

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా ఫిలింనగర్ లో మొక్కలు నాటింది హీరోయిన్  ఫరియా అబ్దుల్లా...

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా ఫిలింనగర్ లో మొక్కలు నాటింది హీరోయిన్  ఫరియా అబ్దుల్లా...ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రతి ఒక్కరు ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. ప్రతీ ఒక్కరు తమకు వీలయినన్ని మొక్కలు నాటి పర్వావరణాన్ని కాపాడాలన్నారు ఫరియా.

 

  అయితే గ్రీన్ ఇండియా ఛాలెంజ్  తీసకున్న వారు..  ఆ ఛాలెంజ్ ను ఇంకొకరికి శేర్ చేసి.. ఛాలెంజ్ విసరవచ్చు. హీరోయిన్ ఫరియా ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాల్సిందిగా నటులు ఆనంద్ దేవరకొండ,నవీన్ పొలిశెట్టి ,హీరోయిన్ శాన్వి మేఘన ముగ్గురికి చాలెంజ్ విసిరారు. మొక్కలు నాటిన తరువాత గ్రీన్ ఇండియా ఫౌండర్స్ నుంచి వృక్షవేదము పుస్తకాన్ని  కూడా అందుకున్నారు  పరియా అబ్డుల్లా.

 

జాతిరత్నాలు సినిమాలో నటించి తొలి సినిమా తోనే  సూపర్ సక్సెస్ అందుకున్న ఫరియా అబ్ధుల్లా.. ఈ సినిమా సక్సెస్ తో వరుస అవకాశాలు అందుకుంటుంది. కాని చిన్న సినిమాల అవాకాశాలు.. చిన్న చిన్న పాత్రలే వస్తున్నాయి తప్పించి.. హీరోయి గా నటించే అవకాశం రావడం లేదు ఫరియాకు. రీసెంట్ గా అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలో ఈమె చిన్న పాత్రలో కనిపించింది. తాజాగా బంగార్రాజు లో ఐటెం సాంగ్  కూడా చేసింది. ఆ పాట లో నాగ చైతన్యతో ఈ అమ్మడి మాస్ స్టెప్పులకు అంతా ఫిదా అవుతున్నారు.

Also Read : Sai Pallavi: బాలీవుడ్ కు సాయి పల్లవి.. కాని కండీషన్స్ అప్లై అంటోంది..

జాతిరత్నాలు సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలం అవుతున్న ఫరియాను ఆ శేడ్స్ వదలడం లేదు. ఇప్పటికీ ఆమెను చిట్టీ అనే పిలుస్తున్నారు. చిట్టీ అనేది ఫరియా స్క్రీన్ నేమ్ గా స్థిరపడే అవకాశం కూడా ఉంది. జాతిరత్ను మూవీలో అమాయకపు యంగ్ లాయర్ గా కనిపించింది ఫరియా. నవీన్ పొలిశెట్టి ఎనర్జీకి తగ్గట్టుగా పోటా పోటీ కామెడీ చేసి నవ్వించింది. ఇక బగార్రాజుల్ పూర్తి భిన్నంగా ఐటమ్ సాంగ్ చేసింది చిట్టి. మరి ఇండస్ట్రీలో ఈమె హీరోయిన్ గా సెటిల్ అవుతుందా లేదా అనేది చూడాలి.

click me!