
సినిమా ప్రమోషన్లు డిఫరెంట్ గా చేయాలి అంటే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తరువాతే ఎవరైనా.. మునిగిపోయో సినిమా అయినా సరే దాని హడావిడి మామూలుగా ఉండదు. డిజాస్టర్ అయ్యే సినిమా అయినా ఏదో ఒక రకంగా ఆసినిమా గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తాడు బాలీవుడ్ స్టార్ సీనియన్ హీరో. ఈక్రమంలో అక్షయ్ కుమార్ రీసెంట్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాడు. అది కూడా ఓ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ అరుదైన ఘనత సాధించాడు అక్షయ్.
మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొని కేవలం 3 నిమిషాల్లో 184 సెల్ఫీలు దిగి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఈ ఆనందాన్ని తన అభిమానులతో ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. బాలీవుడ్ లో వరుస సినిమాలతో మంచి జోష్ మీద ఉన్న హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం సెల్ఫీ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయిన్ డ్రైవింగ్ లైసెన్స్ సినిమాకు హిందీ రీమేక్ గా తెరకెక్కుతోంది. అయితే ఈసినిమాను ఎలాగైనా సాలిడ్ సక్సెస్ అయ్యేలా అక్షయ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ముంబాయి లో గ్రాండ్ గా ప్రమోషన్స్ కార్యక్రమం నిర్వహించారరు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ తన కోసం వచ్చిన అభిమానులతో సెల్ఫీలు దిగారు. ఈ ఫీట్ తో అక్షయ్ కుమార్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు.
అయితే సెల్ఫీ సినిమా కోసం అక్షయ్ కుమార్ ఇంత కష్టపడుతుంటే.. ఈసినిమాకు ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ మాత్రం రావడంలేదు. నిన్నటి వరకూ.. సెల్ఫీసినిమా కోసం దేశ వ్యాప్తంగా 10 వేల టికెట్లు కూడా అడ్వాన్స్ బుకింగ్ అవ్వలేదు. 8వేలపైన కొన్ని టికెట్స్ మాత్రమే ఆన్ లైన్ లో అమ్ముడు అయ్యాయి. దాంతో అక్షయ్ కుమార్ అండ్ టీమ్ లో గుబులు మొదలు అయ్యింది. ఇంత కష్టపడి రికార్డ్ క్రియోట్ అయ్యేలా ప్రమోషన్లు చేస్తుంటే.. అడ్వాన్స్ బుక్సిస్ షాక్ ఇవ్వడంతో.. నిరాశాలో ఉన్నారు సెల్ఫీ టీమ్. అయితే కొన్ని సినిమాలు రిలీజ్ తరువాత దూసుకుపోతుంటాయి. మౌత్ టాక్ తో జనాలను ఆకర్షిస్తాయి.. ఈక్రమంలోనే ఈ సినిమా కూడా అలానే సక్సెస్ సాధిస్తుందా..? లేక బాక్సాఫీస్ దగ్గర చతికల పడుతుందా చూడాలి.
ఏది ఏమైనా అక్షయ్ కుమార్ కష్టానికి గిన్నిస్ బుక్ రికార్డ్ అయినా వచ్చింది అని సంతోషపడుతున్నారు ఫ్యాన్స్. ఇక ఈ ఈవెంట్ లో అక్షయ్ సెల్ఫీలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు అక్షయ్ కుమార్ ని సెల్ఫీ కింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆరెంజ్ కలర్ డ్రెస్ లో అక్షయ్ ను చూసి తెగ మురిసిసోతున్నారు. ప్యాన్స్.