
ఈరోజు ఎపిసోడ్ లో జానకి, రామచంద్ర గారు ముందు మీరు బైక్ తీయండి వెళ్దాము అని అంటుంది. అప్పుడు బైక్ ఎక్కిన జానకి భుజం మీద చేయి వేయాలి అని వేయబోతుండగా వద్దు అనుకొని నడుము చుట్టూ చేయి వేసి రామచంద్రని హత్తుకుని పట్టుకుంటుంది. అప్పుడు రామచంద్ర సంతోష పడుతూ ఉంటాడు. ఆ తర్వాత రామచంద్ర జానకి ఇద్దరు సంతోషంగా ఒక చోటికి వెళ్తారు. అప్పుడు రామచంద్రని కళ్ళు మూసుకోమని చెబుతుంది జానకీ. అప్పుడు జానకి గులాబీ పువ్వులు తీసుకొని వచ్చి ఏంటి కొత్తగా చూస్తున్నారు రామా గారు, అందరికీ జీవితంలో ముందు వచ్చేది నాకు తర్వాత వచ్చింది.
అసలు ప్రేమికుల కోసం ప్రత్యేకంగా ప్రేమికుల రోజు ఉంటుందని నాకు తెలియదు రామా గారు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చదివిన తప్ప దేన్నీ ప్రేమించలేదు. మీరు నన్ను ప్రేమించానని చెప్పారు నేను మాత్రం మిమ్మల్ని పెళ్లి అయిన తర్వాత ప్రేమించాను. కానీ నా ప్రేమ విషయాన్ని ఎప్పుడు మీతో చెప్పలేదు ప్రేమిస్తే ఎంత గొప్పగా ఉంటుందో నాకు తర్వాత తెలిసి వచ్చింది. అప్పుడు జానకి పువ్వులు ఇచ్చి ఐ లవ్ యు రామ గారు అని అంటుంది. రామచంద్ర కి పువ్వులు ఇచ్చి రామచంద్ర చేతిని ముద్దాడి సంతోష పడుతూ ఉంటుంది. రామచంద్ర మాత్రం జానకి వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు రామచంద్ర జానకి చేతిని విడిచిపెడతాడు.
క్షమించండి జానకి గారు మీ మనసులోని ప్రేమగా మీరు చాలా గొప్పగా చెప్పారు కానీ ఆ ప్రేమను అందుకునేంత మనశ్శాంతి నాకు లేదు అని అంటాడు. నా మనసంతా తమ్ముళ్ల గురించి ఆలోచిస్తుంది అని అంటాడు. మీరు మీ ప్రేమను బయటపెడితే నేను నా బాధను బయటపెడుతున్నాను నన్ను క్షమించండి జానకి గారు అని అంటాడు రామచంద్ర. తర్వాత రామచంద్ర, జానకి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తరువాత జ్ఞానాంబ బాధపడుతుండగా మల్లిక మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నందుకు సంతోషంగా ఉంది అని డ్యాన్సులు చేస్తూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజులు భోజనం చేదువురా జ్ఞానం అనడంతో వద్దండి అంటుంది.
తర్వాత మల్లిక బట్టలు సర్దుకుంటూ ఉండగా గోవిందరాజులు అక్కడికి వెళ్తాడు. ఏంటమ్మా వెళ్ళిపోతున్నారా అనడంతో అవును మామయ్య గారు తప్పడం లేదు అంటుంది. మీ అత్తయ్య చాలా బాధపడుతుంది అనగా అత్తయ్య గారి గురించి ఆలోచిస్తే ఇంకా మేము వెళ్లడం ఎప్పటికీ సాధ్యం కాదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజులు ఉండిపోమని అడగగా కావాలనే మల్లిక గొడవ సృష్టించాలి అని బయటికి వెళ్తుంది. సరే అత్తయ్య గారు మేము ఏదో కావాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నట్టు మామయ్య గారు మాట్లాడుతున్నారు అని నానా హంగామా చేస్తూ ఉంటుంది మల్లిక.
ఈరోజు నా దగ్గర మాట్లాడిన మాటలు బయట మాట్లాడితే అందరూ నన్ను రాకాసి అనుకుంటారు అని అనుకుంటూ ఉంటుంది మల్లిక. అప్పుడు కావాలనే మల్లిక గొడవలు సృష్టించడానికి దొంగ నాటకాలు ఆడుతూ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకోకండి అత్తయ్య గారు ఈ ఇంట్లో స్థలం లేదని మేము వెళ్ళిపోతున్నాము అని అంటుంది. అప్పుడు మల్లిక దొంగ ప్రేమను కురిపిస్తూ దొంగ నాటకాలు ఆడుతూ ఉంటుంది. అప్పుడు మల్లిక కావాలని చిన్న గొడవ అని పెద్దది చేస్తూ ఉంటుంది. పైకి అలా ఉన్నా మేము వెళ్తే బావున్ను అని నీకు ఉంటుంది కాకపోతే పైకి చెప్పుకోలేకపోతున్నారంతే అని నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతుంది మల్లిక.
చూడండి మామయ్య గారు మమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకోకండి.. మేము ఇంట్లో ఉంటే గొడవలు ఉంటాయని మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము మనం వెళ్దాం పదండి అని విష్ణుని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తుంది. అప్పుడు మల్లిక మాటలు నిజమని నమ్మిన విష్ణు సంతోషంతో థాంక్యూ మల్లిక నువ్వు నా కుటుంబం గురించి ఇంతగా ఆలోచిస్తావని అనుకోలేదు అని అంటాడు. ఇప్పుడు నాకు సన్మానం చేసే కార్యక్రమం తర్వాత ముందు బట్టలు సర్దుకోండి వెళ్ళిపోదాం అంటుంది మల్లిక. జెస్సి మనమైనా ఉండిపోదాం అఖిల్ అత్తయ్య గారు మామయ్య గారు చాలా బాధపడుతున్నారు అనడంతో అవసరం లేదు ఈ ఇరుకు కొంపలో ఉండే దానికంటే బయటకు వెళ్లి పోవడమే బెటర్ అని అంటాడు.
నోరు మూసుకొని చెప్పింది చెయ్ ఈ ఇంటికి మల్ల మనం రావడం అంటూ కుదరదు చెప్పింది చెయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అఖిల్. ఆ తర్వాత జ్ఞానంబ రామచంద్ర, గోవిందరాజులు జానకి అందరూ బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత జానకి దేవుడిని ప్రార్థిస్తూ ఆస్తులు పోయాయి. డబ్బులు పోయాయి ఇప్పుడు బంధాలు కూడా దూరం అవుతున్నాయి అని ఎమోషనల్ గా దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోకుండా ఉండడానికి ఏదో ఒక దారి చూపించు దేవుడా అనుకుంటూ ఉంటుంది.