
చకచకా జరిగిపోతోంది ఆర్ సి 15 షూటింగ్. వరుస షెడ్యూల్స్ తో సందడిచేస్తుంది రామ్ చరణ్ టీమ్. వరుస అప్ డేట్స్ ఇచ్చేస్తున్నారు కూడా. మొన్నటికి మొన్న చార్మినార్ దగ్గర షూటింగ్ అంటూ ఫోటోను షేర్ చేశాడు దర్శకుడు. ఆతరువాత అంతలోనే కర్నూల్ లో ప్రత్యక్షం అయ్యారు. ఇంతలో అక్కడ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం విశాఖపట్నం చేయబోతున్నట్టు తెలుస్తోంది.
రామ్ చరణ్ సినిమా కర్నూలు కొండారెడ్డి బురుజుపై కొంతమేర షూటింగ్ జరుపుకుంది. రాజకీయ ఉపన్యాసానికి సంబంధించిన షెడ్యూల్ ను కంప్లీట్ చేశారట. ఇక ఓ సాంగ్ షూటింగ్ కోసం టీమ్ అంతా వైజాక్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈరోజు (13 పిబ్రవరి ) నుంచి అక్కడ షూటింగ్ జరుగుతుందని సమాచారం. అయితే సాంగ్ రామ్ చరణ్ కు సంబంధించినదే అంటున్నారు టీమ్. డ్యూయోట్ అయితే.. కియారా ఉండాలి కదా. కియారా అద్వాని పెళ్ళి సెలవుల్లో ఉంది. ఈ మధ్యలో ఆమె షూటింగ్ కు వచ్చే అవకాశం లేదు.
వైజగ్ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ అయిపోయినట్టే అంటున్నారు. శంకర్ రామ్ చరణ్ సినిమాన పరుగులు పెట్టిస్తున్నాడు. అటు కమల్ హాసన్ తో భారతీయుడు2 షూటింగ్ చేస్తూనే.. ఇటు చరణ్ సినిమాకు కూడా టైమ్ కేటాయిస్తున్నాడు. రెండు సినిమాలు హ్యాండిల్ చేయడం అంటే డైరెక్టర్ కు కాస్త ఇబ్బందే అనుకోవాలి. ఈక్రమంలోనే చరణ్ మూవీని త్వరగా కంప్లీట్ చేసి.. భారతీయుడు2 షూటింగ్ ను నిదానంగా చూసుకోవచ్చు అనుకుంటున్నాడట.
ఇక రామ్ చరణ్ జోడీగా కియారా అద్వాని నటిస్తున్న ఈసినిమాలో శ్రీకాంత్, అంజలీ, సునిల్, ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. పాన్ ఇండియా క్రేజ్ తో రిలీజ్ కాబోతున్న ఈసినిమాను దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ హిట్ తరువాత ఆచార్యతో దెబ్బతిన్న మెగా పవర్ స్టార్.. ఈసినిమాతో సాలిడ్ హిట్ ఇవ్వాలి అని చూస్తున్నాడు. అటు మెగా ఫ్యాన్స్ కూడా ఈసినిమాకోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.