Janaki Kalaganaledu: జ్ఞానాంబ ఎక్కువ రోజులు బతకదని తెలుసుకున్న జానకి.. మల్లికకు చుక్కలు చూపిస్తున్న తిలోత్తమ?

Published : Feb 21, 2023, 10:44 AM IST
Janaki Kalaganaledu: జ్ఞానాంబ ఎక్కువ రోజులు బతకదని తెలుసుకున్న జానకి.. మల్లికకు చుక్కలు చూపిస్తున్న తిలోత్తమ?

సారాంశం

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 21వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..  

ఈరోజు ఎపిసోడ్లో జ్ఞానాంబ ఏంటి జానకి ఇది వచ్చిన పని చూసుకుని వెళ్లకుండా ఎందుకు ఇవన్నీ అనడంతో ఏం కాదు అత్తయ్య మీ హెల్త్ ఎలా ఉందో తెలుస్తుంది కదా అని అంటుంది. ఇంతలో నర్స్ వచ్చి పిలవడంతో లోపలికి వెళ్తారు. అంతా బాగానే ఉంది కదా డాక్టర్ గారు అనడంతో ఇంకొన్ని టెస్టులు చేయించాలి అప్పుడే మీ హెల్త్ విషయంలో నాకు ఒక క్లారిటీ వస్తుంది అనడంతో ఇప్పుడు వద్దులేండి డాక్టర్ అనగానే చెప్పినట్టు వినండి అని అంటుంది. సరే అని జానకి జ్ఞానాంబ కు టెస్టులు చేయించడానికి వెళుతుంది. మరొకవైపు రామచంద్ర వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు.

అప్పుడు జానకి వాళ్ళు గుర్తు రావడంతో జానకికి ఫోన్ చేస్తాడు. ఏంటి జానకి గారు హాస్పిటల్ కి వెళ్లారు ఒకసారి కూడా ఫోన్ చేయలేదు మీకు హెల్త్ ఎలా ఉంది అనడంతో నాకు కొంచెం బలం కోసం టాబ్లెట్స్ రాసిచ్చారు. హాస్పిటల్ లోనే ఉన్నామూ అత్తయ్య గారికి టెస్టులు చేయిస్తున్నాం అనడంతో అమ్మకు ఏమైంది జానకి గారు అని రామచంద్ర టెన్షన్ పడుతుండగా ఏమీ కాలేదు ఊరికే కొన్ని టెస్టులు చేయిస్తున్నాము అని అంటుంది జానకి. ఇంతలో నర్స్  వచ్చి మేడం టెస్టులు పూర్తయ్యాయి మీరు ఇంటికి వెళ్ళండి మీరు తర్వాత కాల్ చేసి చెప్తాము అనడంతో సరే అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ నువ్వు కాలేజీకి వెళ్ళు జానకి నేను అలా గుడి దగ్గరికి వెళ్లి ఇంటికి వెళ్తాను అని అంటుంది.

మరొకవైపు మలయాళం సరదాగా పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ వంటలు చేస్తూ ఉంటాడు. అప్పుడు మల్లిక ఒళ్లంతా హూహనమైపోయింది అనుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి తిలోత్తమా రావడంతో దాక్కోవాలి అనుకుంటుండగా మలయాళం గోన సంచి తీసుకొని వచ్చి ఇందులో దాక్కొండి అమ్మగారు అని చెప్పడంతో మల్లిక ఆ గోనె సంచిలో దాక్కుకుంటుంది. ఇంతలో తిలోత్తమా అక్కడికి వచ్చి నా రెండో కోడల్ని చూసావా అనగా లేదు అమ్మ గారు అంటుండడంతో ఇంతలో అక్కడికి గోవిందరాజులు వచ్చి తిలోత్తమను చూసి సిగ్గుపడుతూ ఉంటాడు.

అప్పుడు గోవిందరాజులు బూడిద గుమ్మడికాయ ఇవ్వమని అడగగా లేదు అని అంటాడు. అప్పుడు త్రిలోత్తమా గోనెసంచి లాగడంతో అక్కడ మల్లిక ఉండడం చూసి ఇద్దరు షాక్ అవుతారు. ఏంటే కోడలు పిల్ల నేను వెతుకుతున్నానని చెప్పి ఇక్కడ దాక్కున్నావా ఈరోజు నువ్వు నా చేతిలో అయిపోయావు కదా అని మల్లికను అక్కడినుంచి పిల్చుకొని వెళ్తుంది. మరొకవైపు జానకి వాళ్ళ మేడం జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. నెక్స్ట్ మంత్ సివిల్స్ వస్తున్నాయి. నువ్వు చాలా జాగ్రత్తగా చదవాలి అనడంతో సరే అని అంటుంది జానకి. ఆ తర్వాత జానకికి హాస్పిటల్ నుంచి ఫోన్ రావడంతో అక్కడికి వెళుతుంది.

ఆ తర్వాత జానకి డాక్టర్ దగ్గరికి వెళ్ళగా అప్పుడు డాక్టర్ నేను అనుకున్నట్టుగానే అయ్యింది మీ అత్తయ్యకి చాలా పెద్ద ప్రాబ్లం ఉంది మీ అత్తయ్య గారికి ఒక కిడ్నీ పూర్తిగా చెడిపోయింది అనడంతో జానకి షాక్ అవుతుంది. రెండో కిడ్నీ కూడా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మీ అత్తయ్య గారు బతికే అవకాశాలు లేవు అనడంతో జానకి షాక్ అవుతుంది. అప్పుడు జానకి ఎమోషనల్ అవుతుంది. డాక్టర్ జానకిని ఓదారుస్తూ మీ హస్బెండ్ నెంబర్ ఇవ్వండి నేను అతనికి చెబుతాను అనడంతో వద్దు డాక్టర్ ఎవరికీ చెప్పొద్దు అని చేతులు జోడించి అడుగుతుంది.

మరొకవైపు అందరూ కలసి సరదాగా పనులు వారు చేసుకుంటూ ఉండగా అప్పుడు తిలత్తమా మల్లిక తో ఆటలు ఆడుకుంటూ ఉంటుంది. ఏంటో ఈ అత్తమ్మ నేను వీళ్ళతో ఆడుకుందామనుకుంటే ఈమె నాతో ఆడుకుంటుంది అనుకుంటూ ఉంటుంది మల్లిక. ఇంతలోనే జానకి ఇంటికి వస్తుంది. అప్పుడు జానకి రిపోర్ట్స్ ఎవరికి కనిపించకుండా ఉండాలి అనే ఆ రిపోర్ట్స్ని బయటకి దాచి పెట్టడానికి వెళుతుంది. ఇంతలో కావాలని మల్లిక మలయాళం కాలికి గిచ్చడంతో మలయాళం ఆట మీద పడగ సచ్చినోడా నా ఆట చెడగొడతావా అని తిలోత్తమా పరిగెత్తించి మరి కొడుతూ ఉంటుంది.

ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వచ్చి వచ్చావా జానకి వద్దంటే ఆ డాక్టర్ టెస్ట్ ల టెస్ట్ లు  చేయించాడు ఏమన్నారు అనడంతో అంతా బాగానే ఉంది అత్తయ్య అని అంటుంది. ఆ తర్వాత రామచంద్ర ఇంటికి రావడంతో ఇంత అర్ధరాత్రి వరకు అక్కడే ఉంటావా రామచంద్ర అనడంతో ఇప్పుడే వ్యాపారం బాగా అవుతుంది పిన్ని అని అంటాడు. అప్పుడు తిలోత్తమా ఎలా అయినా మల్లిక పని చెప్పాలి అనుకుంటూ ఉంటుంది. తర్వాత రామచంద్ర గదిలోకి వెళ్ళగా జానకి ఒకచోట రామచంద్రని కూర్చోమని చెప్పి కూల్ గా ఉండమని చెబుతుంది. అప్పుడు జానకి అసలు విషయం చెప్పడానికి టెన్షన్ పడుతూ ఉంటుంది.

అప్పుడు జానకి అసలు విషయం చెప్పడానికి ప్రయత్నిస్తుండగా ఇందులో రామచంద్ర నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చనిపోయింది అని బాధపడుతూ ఉండగా జానకి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ లాంటి పరిస్థితి నిజంగా మా అమ్మకి వస్తే మామ కంటే ముందు నేనే చనిపోతాను అనడంతో జానకి షాక్ అవుతుంది. అప్పుడు జానకి ఏడుస్తూ ఉండగా రామచంద్ర జానకి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు జానకి రామచంద్రను గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది.

PREV
click me!

Recommended Stories

Sobhan babu జీవితాన్ని ఒక్క సినిమాతో నిలబెట్టిన ఎన్టీఆర్, ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా?
Illu Illalu Pillalu Today Episode Dec 11: పార్కులో విశ్వతో అమూల్య, చూసేసిన రామరాజు పెద్దకొడుకు