
ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో `ఆర్‌ఆర్‌ఆర్`, `కాంతార`, అలియాభట్ సత్తా చాటారు. `ఆర్‌ఆర్‌ఆర్`కి ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కగా, మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌గా `కాంతార` ఫేమ్ రిషబ్ శెట్టి పురస్కారం వరించింది. వీరితోపాటు ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్‌కి `బ్రహ్మాస్త్ర` చిత్రానికి, ఉత్తమ నటిగా అలియాభట్‌కి `గంగూభాయ్‌ః కథియవాడి` చిత్రానికి గానూ అవార్డులు వరించాయి. ఉత్తమ నటీనటులుగా భార్యాభర్తలకే అవార్డులు దక్కడం విశేషం. ఉత్తమ చిత్రంగా `ది కాశ్మీర్ ఫైల్స్` నిలవడం విశేషం.
2023ఏడాదికిగానూ దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ముంబయిలో సోమవారం రాత్రి గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో బాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఇందులో దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుని అలనాటి తార రేఖకి అందించడం విశేషం. మరోవైపు రణ్‌బీర్ కపూర్ షూటింగ్‌లో బిజీ ఉన్న నేపథ్యంలో ఆయన అవార్డుని కూడా భార్య, నటిన అలియాభట్ అందుకున్నారు.
ఇక అవార్డుల వివరాలు చూస్తే,
ఉత్తమ చిత్రం, ది కాశ్మీర్ ఫైల్స్,
ఉత్తమ దర్శకుడుః ఆర్ బాల్కి(చుప్‌ః ది రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్)
ఉత్తమ నటుడుః రణ్‌బీర్ కపూర్(బ్రహ్మాస్త్ర)
ఉత్తమ నటిః అలియాభట్(గంగూబాయిః కతియవాడి)
మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌ః రిషబ్ శెట్టి(కాంతార)
క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్‌ః వరుణ్ ధావన్(బేడియా)
క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్‌ః విద్యాబాలన్(జల్సా)
మోస్ట్ వర్సటైల్ యాక్టర్‌ః అనుపమ్ ఖేర్
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్‌ః సాచిత్ తాండన్
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌ః మనీష్ పాల్(జగ్ జగ్ జీయో)
ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌ః ఆర్‌ఆర్‌ఆర్.
వీటితోపాటు హిందీ టీవీ, వెబ్ సిరీస్ విభాగంలో అవార్డులను అందించారు. ఇక ఈ కార్యక్రమంలో వరుణ్ ధావన్, రోనిత్ రాయ్, శ్రేయా తల్పాడే, ఆర్ బాల్కి, షాహిల్ ఖాన్, నటాలియా, జయంతిలాల్ గడ, వివేక్ అగ్నిహోత్రి, రిషబ్‌శెట్టి, హరిహరన్, అలియాభట్ వంటి వారు పాల్గొన్నారు. ట్రెండీ వేర్‌లో మెరి ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచారు.