
హీరోయిన్ సమంతకు వృత్తి పట్ల ఎంత నిబద్దతతో తాజా సంఘటనతో రుజువైంది. ఎముకలు కొరికే చలిలో తన పాత్ర కోసం సీరియస్ గా ప్రాక్టీస్ చేశారు. సమంత షాకింగ్ వీడియో వైరల్ గా మారింది. దీంతో సమంత గ్రేట్ అంటూ పలువురు కొనియాడుతున్నారు. మయోసైటిస్ బారినపడిన సమంత కొన్నాళ్ళు షూటింగ్స్ కి విరామం ప్రకటించారు. ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం కొంత మెరుగైన నేపథ్యంలో గతంలో కమిటైన ప్రాజెక్ట్స్ పూర్తి చేసే పనిలో పడ్డారు.
అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిటాడెల్ సిరీస్ కి సమంత సైన్ చేసిన విషయం తెలిసిందే. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో షూట్ చేశారు. లేటెస్ట్ షెడ్యూల్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ లో ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో 8 డిగ్రీల చలిలో సమంత స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సిటాడెల్ సిరీస్ కి యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న యానిక్ బెన్ పర్యవేక్షణలో సీరియస్ గా శిక్షణ తీసుకుంటున్నారు.
ప్రతికూల వాతావరణంలో సమంత రోల్ కోసం చూపిస్తున్న డెడికేషన్ చూసి అందరూ ఔరా అంటున్నారు. అందుకే సమంత స్టార్ అయ్యారంటూ కొనియాడుతున్నారు. సమంత దీనికి సంబంధించిన వీడియో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేశారు. అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇటీవల మనోజ్ బాజ్ పాయ్ సైతం ఆమె హార్డ్ వర్క్ ని కొనియాడారు. సన్నివేశం కోసం సమంత శరీరాన్ని దారుణంగా కష్టపెడతారు. ఆమె వంటి హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్ ని నేను చూడలేదని కితాబు ఇచ్చాడు. ఒక ప్రక్క సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కూడా... ఇలాంటి సాహసాలు చేయడం గొప్ప విషయం.
సిటాడెల్ నందు వరుణ్ ధావన్ సమంతతో పాటు మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో సిటాడెల్ తెరకెక్కుతుంది. విదేశాల్లో కొంత షూటింగ్ జరపాల్సి ఉంది. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్లో శ్రీలంక రెబల్ రోల్ చేసిన సమంత... సిటాడెల్ లో మరోసారి యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ చేస్తున్నారు. అలాగే సమంత ఖుషి చిత్ర షూట్ పూర్తి చేయాల్సి ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఖుషి తెరకెక్కుతుంది. రొమాంటిల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఉన్నాయి.