
ఎపిసోడ్ ప్రారంభంలో అక్కడ జాబ్ మానేసి ఏ గోవాకు వెళ్లి చిల్లవండి నేను చెప్పిన తర్వాత వచ్చి మా కంపెనీలో జాయిన్ అవుతారు కానీ అప్పటివరకు మీ సాలరీస్ మీ అకౌంట్ లో పడిపోతాయి మాన్సీ. డబ్బులు ఇచ్చి ఎంజాయ్ చేయమంటే ఎవరికి ఇష్టం ఉండదు మేడమ్ అంటూ అక్కడ ఉన్న అందరూ ఆ ప్రపోజల్ కి యాక్సెప్ట్ చేస్తారు. ఇలా ఎందుకు చేస్తున్నాను అని అడక్కండి అక్కడ ఉన్న సైట్ ఇంజనీర్స్ అందరిని అక్కడ పని చేయకుండా చేసే బాధ్యత మీదే అని చెప్పి ప్రీతికి తను బుక్ చేసిన ఫ్లైట్ టికెట్స్ ఇప్పిస్తుంది మాన్సీ.
అదే విషయాన్ని జలంధర్ కి ఫోన్ చేసి చెప్తుంది రేపటి నుంచి అక్కడికి పని వాళ్ళందరూ రారు మా బ్రో ఇన్ లా ఓడిపోవడం ఖాయం అంటుంది మాన్సీ. నువ్వు పెట్టిన నిప్పుకి నేను ఆజ్యం పోస్తాను ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరినీ స్ట్రైక్ చేసేలాగా రెచ్చగొడతాను అంటాడు జలంధర్. ఇద్దరూ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటారు. తర్వాత రోజు ఒక వ్యక్తి వచ్చి కూలీలందరూ గొడవ పడుతున్నారు వాళ్ళకి ఇచ్చే రోజు కూలీ తక్కువైందంట అని చెప్తాడు.
రోజు లేనిది ఈరోజు ఏంటి కొత్తగా అని వాళ్ళ దగ్గరికి వస్తాడు ఆర్య. ఈ లోపు కూలీలందరినీ జలంధర్ రెచ్చగొడుతూ ఉంటాడు మన కష్టాన్ని నష్టానికి వాడుకుంటున్నారు తిరగబడిపోతే తొక్కేస్తారు అంటూ వాళ్లని రెచ్చగొడుతూ ఉంటాడు. అంతలోనే అక్కడికి అంజలి,ఆర్య ఇద్దరు వస్తారు. ఏంటి మీ ప్రాబ్లం అని అడుగుతుంది అంజలి బయట ఇచ్చే కూలి కన్నా ఎక్కడా కూలి తక్కువ ఇస్తున్నారు మేడం అని చెప్తాడు ఒక కూలి. మన కన్నా బయట ఎక్కువ ఇస్తున్నారా అని అంజలి ఆర్యని అడుగుతుంది.
అది వాళ్ళనే కనుక్కొని రమ్మనడం అంటూ మీరు పక్కపక్క సైట్లకి వెళ్లి అక్కడ రోజు కూలి అనిపిస్తున్నారో కనుక్కొని రండి అప్పుడు మాట్లాడుకుందాం అంటాడు ఆర్య. కనుక్కొని వచ్చిన వాళ్ళు ఇక్కడ కన్నా రెండు మూడు చోట్ల అక్కడే ఎక్కువ ఇస్తున్నారు అని చెప్తాడు. కూలీలు మరింత రెచ్చిపోతారు. అప్పుడు భార్య కల్పించుకొని అక్కడ ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు చెప్తాను ఇక్కడ మీకు పొద్దున టిఫిన్ తో పాటు అప్పుడప్పుడు మధ్యాహ్న లంచ్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది.
మీకు అవసరం ఉన్నప్పుడు అడ్వాన్స్గా గాని అప్పుగా గాని మీ సాలరీ నుంచి డబ్బు ఇవ్వడం జరుగుతుంది ఇలాగ ఏ సైట్ వాళ్ళు చేయరు. ఒంట్లో బాగోక సెలవు పెడితే సగం జీతం ఇస్తున్నాము ఎందుకంటే మీరందరూ ఈ కంపెనీని నమ్ముకుని ఉన్నారు కాబట్టి. టెక్నాలజీ ప్రకారం కొంతమంది చేయగలిగిన పని ఒక మనిషి చేస్తుంది. అలాంటివి రెండు మూడు కొని పెట్టుకుంటే మీలో సగం మంది అవసరం తగ్గిపోతుంది.
కానీ ఈ సంస్థ అలా చేయకుండా మనుషులతోనే పనిచేయించి వాళ్ళకి పని కల్పిస్తుంది అలాంటి సంస్థకి విశ్వాసంతో ఉండాలి. అన్నం పెట్టే సంస్థ ఏదైనా తల్లితో సమానం. కాబట్టి మనం అందరం విశ్వాసంతో, బాధ్యతతో పనిచేయాలి. ఇప్పుడు మాటలు విని నిర్ణయాలు తీసుకునే ముందు నిజా నిజాలు తెలుసుకోవాలి అంటాడు భార్య వాళ్ళు తప్పు తెలుసుకొని క్షమాపణ కోరి వాళ్ళ పనుల్లోకి వెళ్లిపోతారు. ఆర్యని చూసి ఇంప్రెస్ అవుతుంది.
లీడర్ అంటే అర్థం తెలుసా నీకు జనాలని తెలియని మార్గంలో పెట్టే లీడర్ ఇలాగే ఉండాలి అంటూ యాదగిరికి చూపిస్తుంది. చూసి నేర్చుకోమంటూ కోప్పడుతుంది. తన ప్లాన్ ప్లాన్ ప్లాప్ అయినందుకు కోపంతో రగిలిపోతూ ఉంటాడు జలంధర్. అక్కడ జనాలందరినీ రెచ్చగొడతానన్నావు కదా ఏమైంది అని మాన్సీ ఫోన్ చేసి అడుగుతుంది. నేను రెచ్చగొట్టడం అయింది దాన్ని ఆ ఆర్య వర్ధన్ సాల్వ్ చేయడం కూడా అయింది అంటాడు జలంధర్.
ఆ మాటలకి కోపంతో తగిలిపోయిన అభిమాని అలా అయితే ప్రాజెక్ట్ ని ఈ టైం లో కంప్లీట్ చేసేస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్టు సక్సెస్ కాకూడదు అంటుంది మాన్సీ. వాడికి ఎన్ని ప్రాబ్లమ్స్ తీసుకువచ్చిన బుద్ధి బలంతో గెలుస్తున్నాడు అందుకే నేను వాడే బలహీనత మీద కొడతాను అంటాడు ఏం చేయబోతున్నావు అని మాన్సీ అడిగితే కిడ్నాప్ చేయబోతున్నాను వాడిని మానసికంగా హింసించి చంపేస్తాను అంటాడు జలంధర్.
అలా చేస్తే వర్క్ మీద కూడా కాన్సెంట్రేట్ చేయలేడు ప్రాజెక్టు కూడా ఆగిపోతుంది గుడ్ ఐడియా క్యారీ ఆన్ అంటుంది మాన్సీ. ఆ గుడ్ న్యూస్ ఈరోజే అందిస్తాను అంటాడు జలంధర్. మరోవైపు సైట్ ఇంజినీర్స్ సంగతి ఏంటి అని ప్రీతి ని అడుగుతుంది మాన్సీ. ఈరోజు నుంచి వాళ్లు కంపెనీ కి రారు మేడం అంటుంది ప్రీతి. టోటల్గా అన్ని రకాలుగా బ్రో ఇన్ లా డిస్టర్బ్ అయిపోవాలి అంటుంది.
మరోవైపు అను పిల్లలకి చదువు చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి మీ ఆయన్ని ఎవరో నలుగురు మనుషులు రక్తం వచ్చినట్లు కొడుతున్నారు అని చెప్తాడు. నా మాటలకి కంగారుగా పరిగెడుతుంది అను. కారులో నుంచి ఆర్య పిలిచినట్లుగా ఒక వ్యక్తి పిలుస్తాడు. అందులో ఉన్నది ఆర్య ఏమో అని కంగారుగా కారు వెనుక పరిగెడుతూ వెళ్ళిపోతుంది అను. కొంత దూరం పోయిన తర్వాత ఆ కారు ఆగి కనిపిస్తుంది. ఆ కారులో లేకపోవడంతో ఆ పక్కనే ఉన్న బిల్డింగ్ లోకి వెళ్లి ఈ చుట్టూ వెతుకుతుంది.
అను అంటూ కేకలు వినిపిస్తాయి ఆమెకి. అక్కడ జలంధర్ కనిపిస్తాడు పాపం బాగా భయపడినట్లుగా ఉన్నావు అంటూ నవ్వుతాడు. నాకు దాగుడుమూతలు ఆట చాలా ఇష్టం ఆడుకోవడానికి ఎవరు దొరకలేదు అందుకే నీతో ఆడాను ఎలా ఉంది నా ఆట. ఇప్పుడు నేను దొరికిపోయి అవుట్ అయిపోయాను ఇప్పుడు నిన్ను అవుట్ చేయాలి కదా, నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డని కూడా శాశ్వతంగా అవుట్ చేస్తాను అంటాడు జలందర్. ఆర్య సర్ చేతిలో చస్తావ్ అంటుంది అను.
ముందు నీ మొగుడు బ్రతికుంటేనే కదా అంటాడు జలంధర్.ఆర్య సర్ ని ఏం చేసావు అంటూ కాలర్ పట్టుకుంటుంది అను. ఏం చేశానో చచ్చాక మీరు మీరు వెళ్లి మాట్లాడుకోండి. వాడిని చంపే వరకు నువ్వు ఇక్కడే పడి చావు అంటూ ఆమెని తోసేస్తాడు. యు ఆర్ లాకెడ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఆర్య దగ్గరికి వచ్చి సైట్ ఇంజనీర్స్ అందరూ డిజైన్ చేశారంట అని చెప్తుంది ప్రీతి. పక్కనే ఉన్న అతను అసిస్టెంట్ కి వాళ్ళకి ఫోన్ చేసి ఇవ్వు నేను మాట్లాడుతాను అంటాడు ఆర్య.
నేను ఆల్రెడీ ట్రై చేశాను సార్ ఎవరి ఫోన్ నెంబర్లు పనిచేయట్లేదు అంటుంది ప్రీతి. అందరూ రిజైన్ చేశాక ఇంక పనేెం నడుస్తది ఇంక ఈ ప్రాజెక్టు మునిగినట్లే యాదగిరి. ఆ మాటలకి సీరియస్గా చూస్తాడు. అంజలి మేడంకి ఈ విషయం చెప్పేవాన్ని ప్రీతిని అడుగుతాడు ఆర్య.చెప్పాను సర్ ఆవిడ కంపెనీ ఏజెంట్ కి ఫోన్ చేసి కొత్త వాళ్ళని అపాయింట్ చేయమని చెప్పారు అంటుంది ప్రీతి.
అదంతా కుదిరే పని కాదు గాని అంటూ అసిస్టెంట్ దగ్గర లాప్టాప్ తీసుకుని ఒక మెసేజ్ క్రియేట్ చేసి ఇది సోషల్ మీడియాలోని ఆల్ ఇంజనీరింగ్ సైట్స్ లోని పోస్ట్ చేయు అని చెప్పి తన అసిస్టెంట్ కి ఇస్తాడు ఇదంతా వర్క్ అవుట్ అవుతుందో సర్ అని అడుగుతుంది ప్రీతి. రాని వాళ్ళని బ్రతిమలాటం కన్నా పని కావాల్సిన వాళ్ళకి ఈ పని కల్పించడం మంచిది అంటాడు ఆర్య. నాకు తెలిసి పాజిటివ్ రెస్పాన్స్ ఏ వస్తుంది టెన్షన్ పడొద్దు అంటాడు ఆర్య. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.