జై లవకుశతో చిరంజీవి, పవన్ లను బీట్ చేసిన ఎన్టీఆర్

Published : Sep 22, 2017, 04:27 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
జై లవకుశతో చిరంజీవి, పవన్ లను బీట్ చేసిన ఎన్టీఆర్

సారాంశం

తొలిరోజు ఎన్టీఆర్ జై లవకుశ కలెక్షన్స్ రూ.40 కోట్లు యూఎస్ బాక్సాఫీసు వద్ద 560,699 డాలర్లు (సుమారు రూ.3.64 కోట్లు) రాబట్టిన జైలవకుశ పవన్ కళ్యాణ్, చిరందీవిల రికార్డులు క్రాస్ చేసిన ఎన్టీఆర్ిా  

ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటించిన జైలవకుశ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా చాలా బాగుందని, అంతకు మించి ఎన్టీఆర్ యాక్షన్ అదిరిపోయిందని ప్రేక్షకులు అంటున్నారు. దీనికి తగ్గట్టుగానే బాక్సాఫీసు వద్ద ‘జై లవ కుశ’ కలెక్షన్ల వర్షం కురిపించింది. తొలి రోజు దేశ వ్యాప్తంగా రూ.24 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అటు యూఎస్ బాక్సాఫీసు వద్ద 560,699 డాలర్లు (సుమారు రూ.3.64 కోట్లు) రాబట్టింది. ఈ మేరకు ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

 

తొలిరోజే కలెక్షన్లు ఈ రేంజ్‌లో ఉంటే వారం రోజులు రూ.100 కోట్లు వసూలు చేయడం ఖాయమని సినీ విమర్శకులు అంటున్నారు. ఎన్టీఆర్ గత చిత్రం ‘జనతా గ్యారేజ్’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 134 కోట్లు వసూలు చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో ఇది మూడో అత్యధిక వసూళ్ల రికార్డు. ఇప్పుడు ‘జై లవ కుశ’ దీన్ని దాటేస్తుందని అంటున్నారు. కాగా, ‘జై లవ కుశ’ సినిమాకి రూ.65 కోట్లు వరకు ఖర్చుపెట్టారు. కానీ రిలీజ్‌కు ముందే తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.80 కోట్ల బిజినెస్ చేసేసింది. ఇప్పుడు తొలిరోజే హిట్ టాక్ రావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్ మరోసారి బాక్సాఫీసును షేక్ చేసేస్తున్నాడు.

 

కేవలం ప్రీమియర్ షోల ద్వారానే 7లక్షల డాలర్లు వసూలవుతాాయని అంచనా. ఇఖ ఇప్పటికే పవన్ కళ్యాణ్, సర్దార్ గబ్బర్ సింగ్ రికార్డులు, ఖైదీ నంబర్ 150 రికార్డులు ఫస్ట్ డేకలెక్షన్స్ టాప్ లోకి వెళ్లి ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. ఇక గతంలో ఎన్టీఆర్ పేరున వుండే జనతా గ్యారేజ్ వసూలు కూడా క్రాస్ చేసింది జై లవకుశ. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే చిరంజీవి ఖైదీ నెంబర్ తర్వాత నాన్ బాహుబలి చిత్రాల్లో హైయస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా అవతరించనుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన జైలవకుశ లో రాశి ఖన్నా, నివేతా థామస్ హిరోయిన్లుగా నటిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి