తమన్నాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోలింగ్

Published : Sep 22, 2017, 03:30 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
తమన్నాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోలింగ్

సారాంశం

ఎన్టీఆర్ జైలవకుశలో ఐటమ్ సాంగ్ లో చేసిన తమన్నా బాహుబలి తర్వాత పెద్దగా అవకాశాలు రాని తమన్నా కలిసొస్తుందనుకుంటే తమన్నా ఐటమ్ నంబర్ పై పెదవి విరుస్తున్న ఫ్యాన్స్

స్టార్ హీరోల సినిమాల్లో స్టార్ హీరోయిన్లతో ఐటమ్ సాంగ్స్ చేయించడం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. కొత్త భామలతో పోటీ ఎక్కువవడంతో ఐటమ్ సాంగ్స్ చేయడానికి స్టార్ హీరోయిన్లు వెనకాడటంలేదు. ఈ నేపథ్యంలోనే ‘జై లవ కుశ’ సినిమాలో తమన్నా ఐటమ్ సాంగ్ చేసింది. ప్రస్తుతం తెలుగులో తమన్నాకు అవకాశాలు తగ్గిపోయాయి. ఎన్టీఆర్ సినిమాలో ఐటమ్ సాంగ్‌తో తమన్నా ఫేట్ మారిపోతుందని, అవకాశాలు పెరగడం ఖాయమని అంతా ఊహించారు. చిత్ర యూనిట్ కూడా ఈ పాట మూవీకే హైలైట్ అవుతుందని ప్రచారం చేసింది.

 

‘స్వింగ్ జరా’ అంటూ సాగే ఈ హుషారైన పాటను మొత్తం ఆడియోతో కాకుండా సెపరేట్‌గా విడుదలచేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. కానీ సినిమా చూసిన తరవాత ఆడియన్స్ తమన్నాపై పెదవి విరుస్తున్నారు.తమన్నా సాంగ్ ఆశించినంతగా అలరించకపోగా, సినిమా నెగిటివ్ ఎలిమెంట్స్‌లో ఒకటిగా నిలిచిందని ప్రేక్షకులు అంటున్నారు. తమన్నా ఐటమ్‌ సాంగ్ వల్ల ‘జై లవ కుశ’కు కలిసొచ్చేది ఏమీ లేదని, ఈ సాంగ్ కన్నా ‘జనతా గ్యారేజ్’లో కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ చాలా బాగుందని ఆడియన్స్ టాక్.

 

కాకపోతే తారక్ నట విశ్వరూపంతో ‘జై లవ కుశ’ నెగిటివ్స్ అన్నీ మాయమైపోయాయి. కేవలం తమన్నా ఐటమ్ సాంగ్ కోసమే సినిమాకు వెళ్లేవారికి మాత్రం నిరాశ తప్పదని అంటున్నారు. కాగా, తమన్నా గతంలో ‘అల్లుడు శీను’ సినిమాలోనూ ఐటమ్ సాంగ్ చేసింది. అలాగే ‘ఆగడు’ సినిమాలో శృతిహాసన్, ‘సరైనోడు’లో అంజలి, ‘నాయక్’లో చార్మి, ‘కొమరంపులి’లో శ్రియ ఇలా చాలా మంది స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేశారు. వీళ్ల విషయంలో కూడా అప్పట్లో రకరకాల అభిప్రాయాలు వెలువడ్డాయి.

PREV
click me!

Recommended Stories

The Raja Saab: భారీ రేట్‌కి రాజా సాబ్‌ ఓటీటీ డీల్‌, నిర్మాత బతికిపోయాడు.. ప్రభాస్‌ మూవీ టోటల్ లాస్‌ ఎంతంటే
Illu Illalu Pillalu Today Episode Jan 27: మళ్లీ విశ్వక్ మాయమాటలు నమ్మిన అమూల్య, పెళ్లి ఆగిపోతుందా?