మ్యూజిక్ డైరెక్టర్ సతీమణి, ప్రముఖ గాయని మృతి!

pratap reddy   | Asianet News
Published : Aug 15, 2021, 06:51 PM IST
మ్యూజిక్ డైరెక్టర్ సతీమణి, ప్రముఖ గాయని మృతి!

సారాంశం

బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయని జగ్జీత్ కౌర్(93) ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.  జగ్జీత్ కౌర్ ఎవరో కాదు.. బాలీవుడ్ దివంగత మ్యూజిక్ డైరెక్టర్ మహమ్మద్ జహూర్ ఖయ్యుమ్ సతీమణి.

బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయని జగ్జీత్ కౌర్(93) ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.  జగ్జీత్ కౌర్ ఎవరో కాదు.. బాలీవుడ్ దివంగత మ్యూజిక్ డైరెక్టర్ మహమ్మద్ జహూర్ ఖయ్యుమ్ సతీమణి.  జగ్జీత్ కౌర్ 1927లో రోహన్ లో జన్మించారు. 1950లోనే బాలీవుడ్ లో సింగర్ గా పాపులర్ అయ్యారు. 

ఆదివారం ఉదయం 6 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. ఆమె అంత్యక్రియలు పవన్ హన్స్ క్రిమిటీరియంలో జరిగాయి. 

బజార్ చిత్రంలోని దేఖ్ లో ఆజ్ హం కో, షోలా ఔర్ శబాణం చిత్రంలోనే పహాలే తో అంఖ్ మిలనా లాంటి సాంగ్స్ తో జాగిత్ కౌర్ పాపులర్ అయ్యారు. తన భర్త ఖయ్యుమ్ సంగీతం అందించిన చిత్రాల్లో కూడా ఆమె పాటలు పాడారు. 

ఖయ్యుమ్, జగ్జీత్ కౌర్ ఇద్దరూ 1954లో వివాహం చేసుకున్నారు. ఖయ్యుమ్ కూడా రెండేళ్ల క్రితమే 2019లో మరణించారు. ఊపిరి తిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఖయ్యుమ్ అనేక జాతీయ అవార్డులతో పాటు భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆయన సతీమణి జగ్జీత్ కౌర్ మృతితో బాలీవుడ్ సంతాపం తెలియజేస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి