Guppedantha Manasu: చలి జ్వరంతో వణికిపోతున్న రిషికి తోడుగా వసుధార.. దేవయానికి జగతి స్ట్రాంగ్ వార్నింగ్!

Published : Feb 24, 2023, 07:07 AM ISTUpdated : Feb 24, 2023, 08:02 AM IST
Guppedantha Manasu: చలి జ్వరంతో వణికిపోతున్న రిషికి తోడుగా వసుధార.. దేవయానికి జగతి స్ట్రాంగ్ వార్నింగ్!

సారాంశం

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 24వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర జగతి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే ఎక్కడికి రిషి వస్తాడు. ఇద్దరూ నా రూమ్ కి వచ్చారు అంటే ఏదో పెద్ద విశేషమే ఉండాలి ఏంటి డాడ్ అది అని అడుగుతాడు రిషి. ఏంటి రిషి మమ్మల్ని ఇంతేనా నువ్వు అర్థం చేసుకున్నది అనడంతో అంత పెద్ద నిజం దాచి బాగానే చేశారు కదా అని అంటాడు రిషి. పాయింట్ కి వస్తాను రిషి వసుధారని నువ్వు అవాయిడ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది అనడంతో మనం అనుకున్నవన్నీ నిజాలు కాదు కదా డాడ్ అంటాడు. మరి మీకేం అనిపించింది మేడం మీరు మనుషుల్ని మనసుల్ని అంచనా వేస్తారు కదా మీ శిష్యురాలిలా అని అంటాడు. చెప్పు రిషి అంత అయిపోయింది కదా అపార్ధాలు తొలగిపోయాయి కదా తనని అలా దూరం పెట్టడం అనగా డాడ్ తను చేసింది నాకు నచ్చలేదు అని అంటాడు రిషి.

నా ఎమోషన్స్ తో మీరు ముగ్గురు కలిసి ఆడుకున్నారు అనడంతో ముగ్గురు అని చెప్పి మమ్మల్ని ఎందుకు కలుపుతావు అంటాడు. అందులో మా తప్పు లేదని చెప్పింది కదా అనగా అంటే మీరు తప్పు చేయలేదని అంటారా డాడ్ అని అంటాడు. తను చెప్పింటే అలా చేసాము అనడంతో వసుధార చెప్తే చేశారు కొడుకు గురించి ఆలోచించలేదా కొడుకుకి చెప్పాలనిపించలేదా అని అడుగుతాడు రిషి. మహేంద్ర నచ్చచెప్పడానికి ప్రయత్నించగా రిషి మాత్రం వినిపించుకోకుండా అలాగే మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు జగతి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా అక్కడ దేవయాని నీ చూసి షాక్ అవుతారు. అప్పుడు జగతి అక్కయ్య ఎక్కువసేపు అలాగే నిలిచి ఉంటే కాలు నొప్పిపుడుతాయి వెళ్దాం పదండి అనడంతో ఇంతలో మహేంద్ర వదిన గారు చాటుగా ఉండి మాటలు అన్ని విన్నారు కదా అంటాడు.

అప్పుడు దేవయాని నేనేం వినలేదు ఇప్పుడే వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు వసుధార రిషి గురించి ఆలోచిస్తూ మా జెంటిల్మెన్ ఏం చేస్తున్నాడు అనుకుంటూ ఉంటుంది. మరోవైపు రిషి తన గదిలో కూర్చుని కాలేజీలో వసుధార  అన్న మాట తలుచుకుని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వసుధార మెసేజ్ చేయడంతో అప్పుడు వాళ్ళిద్దరూ చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ వెటకారంగా మెసేజ్లు చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మొదటి రోజు ఉదయం రిషి పొద్దు తెల్లవారినా ఇంకా లేవక పోయేసరికి మహేంద్ర అక్కడికి వచ్చి నిద్ర లేపడానికి ప్రయత్నించగా జ్వరం రావడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలోనే వసుధార ఫోన్ చేయడంతో రిషికి జ్వరం వస్తుందని చెప్పగా వెంటనే వసుధార బయలుదేరుతుంది.

ఆ తర్వాత దేవయాని రిషి దగ్గరకు కూర్చుని ఏంటి మహేంద్ర ప్లాన్లు వేసి మిషన్ ఎడ్యుకేషన్ ప్లాన్ అదిరింది అని చెప్పి అక్కడ ఇక్కడ తిప్పితే రిషికి జ్వరం వచ్చింది చూడండి అంటూ జగతి వాళ్ళ మీద సీరియస్ అవుతూ ఉంటుంది. ఇంతలో సార్ కి ఎలా ఉంది హాస్పిటల్కి తీసుకెళ్ళారా అని టెన్షన్ పడుతూ ఉండగా కూల్ వసుధార ఇప్పుడే డాక్టర్ వచ్చి చెప్పారు ఒక 2 డేస్ లో తగ్గిపోతుంది అని చెప్పారు అని అంటుంది జగతి. అప్పుడు దేవయాని మేడం పక్కకి లేయండి మిమ్మల్ని మేడం పక్కకు లేయండి అని చెప్పి రిషి పక్కన కూర్చుని టెన్షన్ గా మాట్లాడుతే ఉంటుంది వసుధార. అప్పుడు రిషికి తడి బట్ట వేస్తుంది. అది చూసి దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు నిజంగా రిషి సార్ మీద ప్రేమ ఉంటే జ్వరం తగ్గాలనుకుంటే ఇకనుంచి వెళ్ళండి అనడంతో అందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు.

అక్కడే ఉండగా వెళ్లి రిషి సార్ కోసం పాలు పంపించండి అని అంటుంది. ఆ తర్వాత దేవయాని జగతి మీద సీరియస్ అవుతూ పరాయి ఆడపిల్లకి కొడుకుని ఎలా అప్పగించి వస్తావు జగతి అనడంతో వసు పరాయిది ఎలా అవుతుంది అక్కయ్య అని అంటుంది. మహేంద్ర వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు రేపో మాపో వాళ్ళకి మనం పెళ్లి కూడా చేయాల్సి ఉంటుంది అని అంటాడు. మాట్లాడుతున్నారా మహేంద్ర అంటూ దేవయాని వాళ్లపై సీరియస్ అవుతుంది. ఏంటి మహేంద్ర రిషి మీ వైపు ఉండి మీరు చెప్పినట్టు వింటారని అనుకుంటున్నారా ఇప్పటికి ఇప్పుడు నేను ఏదైనా చేయగలను అనడంతో అప్పుడు జగతి దేవయానికి వార్నింగ్ ఇస్తూ ఇప్పుడు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అక్కయ్య రిషి వసుల విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు మీరు ఎన్ని చేసిన ఇప్పటివరకు భరించాము.

మీరు చిన్నప్పటినుంచి ఏమేమి చేశారు మీరు రాజీవ్ కి ఎన్నిసార్లు కాల్ చేశారు ఎందుకు చేశారు, కాలేజీ స్టాప్ కి ఏం చెప్పారు వాళ్ళకి ఏం ప్లాన్లు వివరించారు అన్ని చెప్పేస్తాను అనడంతో దేవయాని టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కదానికి నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది దేవయాని. మరోవైపు రిషి నిద్ర లేవుడంతో వసుధార టాబ్లెట్ ఇచ్చి పాలు తాగమని చెప్పి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి వసుధార చెయ్యి గట్టిగా పట్టుకుని పడుకుంటాడు. ఆ తర్వాత తెల్లవారి నిద్రలేచేసరికి వసుధర అలాగే నిద్రపోతుండగా రాత్రంతా ఇక్కడే పడుకున్నావా అనడంతో మీరు ఇక్కడ ఇలా ఉంటే నేను ఎలా వెళ్తాను సార్ అని అంటుంది.

అప్పుడు రిషి థాంక్స్ చెప్పగా మీరు నాకు థాంక్స్ చెప్పడం ఏంటి ఎండి గారు అనగా ఏం కావాలో అడగడంతో మీరు నాకు ఇవ్వడం ఏంటి సార్ మీరు నేను ఒకటే కదా అని అంటుంది వసుధార. ఇంతలోనే జగతి మహేంద్ర దేవయాని అక్కడికి వస్తారు. సార్ కి బాగుంది వెళ్లి కాఫీ తీసుకొని వస్తాను ఏంటి దేవయాని మేడం అలా చూస్తున్నారు మీకు కూడా కాఫీ తీసుకొని వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?