అల్లు అర్జున్ వైఫ్ లేటెస్ట్ వీడియో చూశారా? ఈమె హీరోయిన్ ఎందుకు కాలేదు!

Published : Feb 23, 2023, 10:41 PM IST
అల్లు అర్జున్ వైఫ్ లేటెస్ట్ వీడియో చూశారా? ఈమె హీరోయిన్ ఎందుకు కాలేదు!

సారాంశం

 స్టార్ మోడల్స్ కూడా ఈర్ష్య పడేలా స్నేహారెడ్డి గ్లామర్ ఉంది. ఇక తరచుగా ఆమె సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. స్నేహారెడ్డి లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. 


స్టైలిష్ ట్రెండీ వేర్ దర్శించిన స్నేహారెడ్డి ఆసక్తికర వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో స్నేహారెడ్డి నర్సరీలో మొక్కల మధ్య గడిపారు. 'మన చుట్టూ మొక్కలు ఉంటే.. అంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి. వాటిని చూస్తే ప్రేమలో పడిపోతాం. వాటి పోషణ చూసుకోవడం ఆహ్లాదం కలిగిస్తుంది. అందుకే నాకు నర్సరీ అత్యంత ఇష్టమైన ప్రదేశం..' అని మొక్కలంటే తనకు ఎంత ఇష్టమో తెలియజేశారు. మొక్కలపై ఆమెకున్న ప్రేమను అటుంచితే స్నేహారెడ్డి స్టైలిష్ లుక్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. 

ఆమె చాలా గ్లామరస్ గా ఉన్నారు. టాప్ మోడల్స్, స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా స్నేహారెడ్డి లుక్ ఉంది. అసలు స్నేహారెడ్డి హీరోయిన్ ఎందుకు కాలేదనే సందేహాలు నెటిజెన్స్ వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి ఉంటే ఇండస్ట్రీని షేక్ చేసేవారంటున్నారు. 

కాగా స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. అయితే స్నేహారెడ్డి ఫాదర్ వీరి పెళ్లికి ఒప్పుకోలేదట. స్నేహారెడ్డి పట్టుబట్టి అల్లు అర్జున్ తో ఏడడుగులు వేశారట. ఇక వీరికి ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు అయాన్, అమ్మాయి అర్హ. శాకుంతలం మూవీతో అర్హ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమవుతున్నారు. ఆమె బాలనటిగా నటించారు. 

ఇక అల్లు అర్జున్ పుష్ప 2 షూట్లో బిజీగా ఉన్నారు. ఇటీవల చిత్రీకరణ మొదలైంది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో సీక్వెల్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. పలు భాషల్లో విడుదల కానున్న పుష్ప 2 టార్గెట్ రూ. 1000 కోట్లు అట. మరి సుకుమార్-బన్నీ ఏ మేరకు తమ లక్ష్యం చేరుకుంటారో చూడాలి. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా... దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?