Guppedantha Manasu: వసుధారకు ధైర్యం చెప్పిన జగతి.. దేవయానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధమైన ధరణి?

By Navya ReddyFirst Published Mar 18, 2023, 7:14 AM IST
Highlights

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు మార్చి 18వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో రిషి అనుకున్నవన్నీ జరగవు ఓటమిన్ ఒప్పుకోవాలి. నోటి పాట్లను సర్దుకోవాలి. వసుధార నేను చెప్పినది ఒప్పుకోలేదు అనుకుంటూ ఉండగా మరోవైపు వసుధార  సార్ మీరు నేను మీ భార్యని కాదు అన్నప్పటి నుంచి నేను నేను కాదు సార్ అనుకుంటూ ఉంటుంది. వసుధార నువ్వు చేసిన ఆ ఒక్క తప్పు వల్ల మనం లైఫ్ లో ఎన్నో మంచి మంచి జ్ఞాపకాలను అద్భుతాలను విష్ చేసుకున్నాం అని అంటాడు రిషి . జీవితంలో అన్నీ సందర్భాలు ఒకేలా ఉండవు కదా నన్ను ఆ సందర్భాలు నాతో ఈ తప్పును చేయించాయి. మీరు గొప్ప శిక్ష వేశారు నాకు అని వసు బాధపడుతూ ఉంటుంది. అప్పుడు చూసి నేను ఏదో నేను బాధ పెట్టాను అని అనుకుంటున్నావు నేను ఎంత బాధ పడుతున్నానో అది ఆలోచిస్తున్నావా అంటూ వసు గురించి రిషి గురించి వసు ఆలోచించుకుంటూ మాట్లాడుతూ ఉంటారు.

 అప్పుడు వసు తాళి చూసి బాధపడుతూ ఉండగా ఇంతలో జగతి అక్కడికి వచ్చి మళ్లీ మొదలైందా అని అంటుంది. ఏంటి పొద్దున్నే వసు ఇది ఆ తాళిని చూస్తే బాధపడుతున్నావు. మళ్లీ పొద్దున్నే చాటింగ్ యుద్ధం ఏమైనా జరిగిందా అని అంటుంది జగతి. రిషి ఏమైనా అన్నాడా అని అనగా రిషి సార్ అంటే నేను బాధపడను కానీ రిషి సారె ఇటువంటి పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నారు మేడం అని అంటుంది. నలుగురిలో నా మర్యాద కాపాడారు కానీ తన భార్య స్థానాన్ని నాకు ఇవ్వడం లేదు అని ఉంటుంది. రిషి నువ్వు అనుకుంటున్నట్టు ఏం కాదు రిషి మనసు బంగారు కొండ. కానీ ఇప్పుడు ఆ మనసు మంచుతో గడ్డకట్టిపోయినట్టు ఉంది అని అంటుంది. దాన్ని నువ్వే ప్రేమతో కరిగించాలి అని అంటుంది.

ఒకప్పుడు ఉన్న రిషి ఇప్పుడు ఉన్నది ఒకేలా ఉన్నాడా నువ్వే ఆలోచించు అంటూ వసుధారకు ధైర్యం చెబుతూ ఉంటుంది జగతి. అందరి ముందు నాకున్న తలభారం దించేసాడని అనుకున్నాను కానీ రిషి సార్ నా భర్త అన్నాడు కానీ నేను తన భార్యని కాదు అంటున్నాడు మేడం అనే బాధపడుతూ ఉంటుంది వసుధార. తర్వాత రిషి కాలేజీకి బయలుదేరగా అప్పుడు వసు రావడం చూసి నన్ను లిఫ్ట్ అడుగుతుందా నా కార్లో వస్తుందా అనుకుంటూ ఉంటాడు. నేను వెళ్లి సార్ ని లిఫ్ట్ అడగాలా సార్ నన్ను రమ్మని చెప్పి అడగవచ్చు కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి ఏం మాట్లాడకుండా వెళ్లి కార్లో కూర్చోవడంతో రిషి సార్ నన్ను ఏమైనా బెదిరిస్తున్నాడా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి హారన్ కొట్టగా వసుధార దగ్గరికి వెళ్తుండడంతో నేను తనకు లిఫ్ట్ ఇవ్వాలా అవసరం లేదు అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి

 ఆ తర్వాత రిషి వసుధార గురించి ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఇంతలో వెనుక వైపు నుంచి సౌండ్ హారన్ విని రిషి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అప్పుడు జగతి మహేంద్ర ఒక బైక్ లో వసుధార ఒక బైక్ లో రావడం చూసి వీళ్లంతా ఇలా వస్తున్నారు అని ఆశ్చర్యపోతాడు రిషి. తర్వాత జగతి మహేంద్ర ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్తారు. అప్పుడు మహేంద్ర బైక్ ఆపి రిషి కాలేజీకి ఎందుకు ఇలా వచ్చారు అని అడిగితే నేను ఏం చెప్పాలో అర్థం కావడం లేదు జగతి అనగా మనసుకి అనిపించింది అలా వచ్చాను అని చెప్పు అని జగతి అనడంతో నాకు అంత ధైర్యం లేదు అని అంటాడు మహేంద్ర.  ఇప్పుడు ఒక మార్గం ఉంది జగతి ఒకటి నీ మీద చెప్పడం లేదంటే మనం అలా బయటకు వెళ్లి రిషి కాలేజీకి వచ్చాక లోపలికి వద్దాం అని బయలుదేరుతుండగా ఇంతలో వసుధార వచ్చి ఏంటి సార్ నన్ను మధ్యలో అలా వదిలేసి వచ్చారు లోపలికి వెళ్దాం పదండి అని అంటుంది.

అప్పుడు వసు ఎంత పిలుస్తున్నా కూడా మహేంద్ర వాళ్ళు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రిషి కూడా కాలేజీకు వస్తాడు. అప్పుడు వాళ్లిద్దరూ దూరం నుంచి ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏంటి డాడ్ వాళ్ళు ఇంకా రాలేదు అనుకుంటూ ఉంటాడు రిషి. అప్పుడు రిషి ఏం మాట్లాడకుండా కోపంగా క్యాబిన్ లోకి వెళ్లి వసుధార రమ్మని చెబుతారు. అప్పుడు వసుధార అక్కడికి వెళ్లకుండా రిషికి ఫోన్ చేయడంతో నేను రమ్మని చెప్పాను ఫోన్ చేయమని చెప్పలేదు అని అంటాడు రిషి. అర్జెంటు వర్క్ ఉంది సార్ అనడంతో సరే నేనే వస్తున్నాను అనగా వద్దులేండి సార్. నేను వస్తున్నాను అని అక్కడికి వెళ్తుంది వసుధార. అప్పుడు వసుధార క్యాబిన్ కి వెళుతుండగా మధ్యలో జగతి అడ్డుపడగా వసుధార మాటలకు జగతి నవ్వుతూ ఉంటుంది. అప్పుడు వాళ్లిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.

ఆ తర్వాత దేవయాని ఎవరికోసమో ఎదురు చూస్తూ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ధరణి వచ్చి ఎవరి కోసం అత్తయ్య గారు ఎవరైనా వస్తున్నారా అనగా నీకు అవసరమా అంటూ ధరణి సీరియస్ అవుతుంది దేవయాని. ఎవరు వచ్చినా నువ్వు రావద్దు నేను పిలిస్తేనే నువ్వు రావాలి అని చెబుతుంది దేవయాని. అప్పుడు పంతులుగారు రావడంతో ఏదో చెబుతుంది. అప్పుడు పంతులుగారు అక్కడి నుంచి వెళ్లిపోతారు.

click me!