Guppedantha Manasu: వసు, రిషిల బంధం బీటలు వారనుందా.. ఆందోళన చెందుతున్న జగతి, మహేంద్ర?

Published : Feb 20, 2023, 07:15 AM IST
Guppedantha Manasu: వసు, రిషిల బంధం బీటలు వారనుందా.. ఆందోళన చెందుతున్న జగతి, మహేంద్ర?

సారాంశం

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 20వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

ఈరోజు ఎపిసోడ్ లో రిషి, వసుధార తన మెడలో వేసుకున్న తాళిని మీరు సమర్థిస్తున్నారా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు జగతి అంటే రిషి అని చెప్పబోతుండగా అవన్నీ నాకు చెప్పొద్దండి మీరు సమర్థిస్తున్నారా లేదా చెప్పండి చాలు అంటాడు. సరే తన మెడలో తాళి వేసుకున్న విషయాన్ని మీరు నమ్ముతారు నేను నమ్ముతాను మరి ప్రపంచం సంగతి ఏంటి అని అంటాడు. రిషి,వసులు కలిసిపోయారని సంతోషంగా ఉన్నారు కదా కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది అంటాడు. సార్ నాకు ఆ సమయంలో అది కరెక్ట్ అనిపించింది అని వసు అనడంతో నీకు ఆ సమయంలో అనిపించింది నువ్వు చేశావు అని అంటాడు.

మెడలో తాళి వేసుకోవడం అంత ఈజీ నా వసుధార ఇప్పుడు ఆ తాళిని తీయగలవా అనడంతో వసుధార షాక్ అవుతుంది. అప్పుడు వసు మౌనంగా ఉండడంతో మరి భవిష్యత్తులో పెళ్లి సంగతి ఏంటి అని ప్రశ్నిస్తాడు రిషి. అంటే ఏంటి సార్ నేను పొరపాటు చేశాను అని అంటున్నారా అనడంతో పొరపాటు కాదు వసుధార చారిత్రిక తప్పిదం అని అంటాడు రిషి. ఇది నువ్వు అనుకుంటున్నావు అంత చిన్న విషయం కాదు వసుధార అని అంటాడు రిషి. నువ్వు నన్ను చేత కానీ వాడిలా నిలబెట్టాలి అనుకున్నావు నన్ను ఒక ఫూల్ చేశావు అని అంటాడు. నువ్వు చేసిన పనికి ఆ రాజీవ్ గాడు మధ్యలో వచ్చి వారికి అనుకూలంగా మార్చుకున్నాడు అనడంతో అందరూ మౌనంగా తలదించుకుంటారు.

నాకు సొసైటీతో పనిలేదు సార్ అని వసుధార అని అనడంతో మరి అందరికీ కనిపించేలా ఆ మెడలో తాళిబొట్టు ఎందుకు వేసుకున్నావు అని ప్రశ్నిస్తాడు రిషి. సర్ ఆ సమయంలో నన్ను నేను రక్షించుకోవడానికి మిమ్మల్ని రక్షించడానికి ఇదే మంచి మార్గం అనుకున్నాను సార్ అని అంటుంది వసు. అప్పుడు వసుధార ఎంత చెప్పడానికి ప్రయత్నించిన రిషి వినిపించుకోకుండా అలాగే మాట్లాడుతూ వసుని మరింత బాధపెడుతూ ఉంటాడు. నాకు ఒకరితో పనిలేదు నేను ఎవరికీ చెప్పను సార్ మీరు నమ్మితే చాలు అంటుంది వసుధార. నేను నమ్మాలి అనుకున్నప్పుడు మొదటే చెప్పాలి కదా ఇన్ని దాపరికాలు ఎందుకు చెప్పు అంటాడు రిషి.

అయినా నువ్వు నా దగ్గర నిజాన్ని దాచావు అని అంటాడు. నాకు చెప్పడానికి ధైర్యం సమయం లేదు సార్ అనడంతో అలా మాట్లాడకు నీ ధైర్యం ఏంటో నాకు తెలుసు అంటాడు రిషి. ధైర్యం ఎక్కడికి పోయింది వసుధార అని కోపంతో నిలదీస్తాడు రిషి. అప్పుడు అవన్నీ పక్కన పెట్టండి సార్ నేను మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారు అని ప్రశ్నిస్తుంది వసుధార. అప్పుడు రిషి నిన్ను వదులుకుంటానని నువ్వెలా అనుకుంటావు చెప్పు అని ఎదురు ప్రశ్నిస్తాడు. నువ్వు చేసిన తప్పు గురించి ఒక్కసారి ఆలోచించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి.

ఆ తర్వాత మహేంద్ర జగతి ఒక చోట నిలబడి ఆలోచిస్తూ ఉండగా అప్పుడు జగతి రిషి మాట్లాడిన మాటలు కరెక్టే అనిపిస్తోంది మహేంద్ర అనడంతో అంత గట్టిగా మాట్లాడారు కదా జగతి వసుధారణి క్షమిస్తాడు అంటావా అని అడుగుతాడు మహేంద్ర. వసుధార అలా చేయకముందే ఆలోచించి ఉండాలి. లేదంటే అంత ధైర్యంగా వసుధర ఎలా చేస్తుంది మహేంద్ర అని అంటుంది జగతి. ఇప్పుడు వసుధర ఎవరు చేయని సాహసం చేసింది కానీ ఆ తాళి వారిద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచింది ఇక్కడి వరకు తీసుకువచ్చింది అంటాడు మహేంద్ర. అప్పుడు మహేంద్ర దీనికి మొత్తం కారణం నువ్వే జగతి నువ్వు ఆరోజు తాళిబొట్టు పంపించక పోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా అంటాడు.

మరి వారిద్దరి దగ్గర అవుతారా అనగా దగ్గరవుతారు మహేంద్ర రిషి క్షమించాడు కాబట్టి వసు దగ్గరికి వచ్చి అన్ని మాటలు అన్నాడు అంటుంది జగతి. అప్పుడు రిషి వస ధరల గురించి వాళ్ళు ఆందోళన చెందుతూ ఉంటారు. ఆ తర్వాత ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు జగతి మహేంద్ర రిషి వైపు అలాగే చూస్తూ ఉంటారు. ఇప్పుడు జగతి మహేంద్ర అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఫణీంద్ర మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి టాపిక్ తీయడంతో దేవయని సీరియస్ అవుతూ వేరే టాపిక్ ఏ దొరకలేదా అని అంటుంది. అప్పుడు ధరణి అక్కడికి స్వీట్ తీసుకుని వస్తుంది.

అప్పుడు రిషి ఈ పొగరు తినిందో లేదో అనుకుంటూ లోపలికి వెళ్తాడు. మరొకవైపు వసుధర రిషి అన్న మాటలు తలచుకుని రిషి ఫోటో చూసి సంతోషపడుతూ ఉంటుంది. మరోవైపు రిషి గదిలోకి వెళ్లి వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నేను అన్నీ మాటలు అన్నందుకు కోపం వచ్చి ఉంటుంది అయినా నా ఎమోషన్స్ తో ఆడుకున్నారు అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే వసుధార ఫోన్ చేస్తుంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?