
ఈరోజు ఎపిసోడ్ లో జగతి, మహేంద్ర ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి రిషి వస్తుండగా రిషి వస్తున్నాడు పడుకో మహేంద్ర అనడంతో మహేంద్ర కడుపు నొప్పి ఉన్నట్లు యాక్ట్ చేస్తూ పడుకుంటాడు. అప్పుడు రిషి అక్కడికి వచ్చి మీ ఆరోగ్యం బాగుందా అనగా విషయం పక్కన పెట్టు నువ్వు వెళ్లిన పని ఏమయింది కాయా,పండుతో నేనేమి టెండర్ వేయడానికి వెళ్లలేదు కదా డాడ్ వెళ్లిన పని బాగానే అయింది అంటాడు రిషి. అప్పుడు మహేంద్ర రిషిని తింగరి తింగరిగా సమాధానాలు అడుగుతూ ఉంటాడు. మేడం డాడీకి ఏమయ్యింది అని రిషి అనగా ఇంతలోనే ధరణి అక్కడికి వస్తుంది. వదిన డాడ్ కి కాషాయం ఇచ్చారా అనగా ఇచ్చాను ఇంకా తాగలేదు అక్కడే ఉంది రిషి అని అంటుంది.
అప్పుడు మహేంద్ర, ధరణి వైపు చూస్తుండగా ధరణి, జగతి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి మహేంద్రకు బలవంతంగా తాగిస్తుండగా వద్దు రిషి అనగా పర్వాలేదు తాగండి ఏం కాదు అని అంటాడు. అది చూసి జగతి నవ్వుకుంటూ ఉంటుంది. చాలయ్య బాబు అనడంతో రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధరణి అక్కడికి వెళ్లిపోవడంతో జగతి,మహేంద్ర సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పటికైనా వాళ్ళ ప్రేమే వాళ్ళని కలుపుతుంది. రిషి నిజం తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది అని అంటుంది జగతి. ఆ తర్వాత రిషి ఒంటరిగా కూర్చొని జరిగిన విషయాలు తలచుకొని బాధపడుతూ ఉంటారు.
అయిన నేను తప్పుగా మాట్లాడానా, కరెక్ట్ గానే మాట్లాడాను కదా అనుకుంటూ వసుధారకు మిస్డ్ కాల్ ఇచ్చి ఆఫ్ చేస్తాడు. రిషి సార్ ఏంటి కొత్తగా మిస్డ్ కాల్ ఇస్తున్నాడు అయినా తనే కాదు నేను మిస్డ్ కాల్ ఇస్తాను అని వసుధార మిస్డ్ కాల్ ఇచ్చి ఆఫ్ చేస్తుంది. ఇప్పుడు రిషి ఏంటి మిస్డ్ కాల్ ఇచ్చి ఆఫ్ చేస్తుందా? చేసింది అంతా చేసి మళ్ళీ నా మీద అలుగుతుంది అనుకుంటూ ఉంటాడు. సరే పోయేదేముంది నేనే చేస్తాను అనుకుంటూ రిషి ఫోన్ చేస్తాడు. అప్పుడు కరెక్ట్ గా వసుధార ఫోన్ చేయడంతో ఇద్దరికీ ఒకేసారి బిజీ వస్తుంది. అనవసరంగా రిషి సార్ ని బాధపెడుతున్నానా ఎక్కువ పంతాలకు పోతున్నానా అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వసు, రిషికి ఫోన్ చేస్తుంది.
ఫోన్ చేసి మాట్లాడాలి అనడంతో ఫస్ట్ మొదలు పెట్టింది మీరు సార్, మిస్డ్ కాల్ ఇచ్చారు కదా అనగా నువ్వు కూడా మిస్డ్ కాల్ ఇస్తావా అని అంటాడు. అంటే ఏంటి సార్ ఇప్పుడు మళ్లీ నన్ను తిట్టడానికి కాల్ చేశారా అని అంటుంది. అప్పుడు వసుధర ఇందాక మీరు ఏం మాట్లాడాలో గుర్తు తెచ్చుకోండి అనడంతో రిషి అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు రిషి ఆవేశంతో ఎన్నో జ్ఞాపకాలు అందించావు చేయాల్సినవని చేశావు కోపంగా మాట్లాడక ఇంకెలా మాట్లాడాలి అని అంటాడు. అప్పుడు వసు మాట్లాడడానికి ప్రయత్నించగా రిషి అవకాశం ఇవ్వకుండా నీ అంత అందంగా మాట్లాడడానికి నాకు రాదు అని ఆవేశంగా మాట్లాడుతాడు. అప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరు వాదించుకుంటూ ఉంటారు. అప్పుడు చెప్పేది వినిపించుకోకుండా బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు రిషి.
అప్పుడు వసుధార ప్రస్తుత పరిస్థితుల్లో నేను నిజం చెప్పిన రిషి సార్ నమ్మడు. ఇప్పుడు మౌనంగా ఉండటమే కరెక్ట్ అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జగతి బుక్ చదువుతూ ఉండగా మహేంద్ర కావాలని గేమ్స్ ఆడుతూ జగతి డిస్టర్బ్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి దేవయాని వస్తుంది. అప్పుడు ఏ మహేంద్ర నీ కడుపునొప్పి ఎలా ఉంది మళ్లీ నీకు కడుపు నొప్పి ఎప్పుడు వస్తుంది అనడంతో కడుపునొప్పి చెప్పి రాదు కదా వదినా అనడంతో నీకు అన్ని అలాగే చెప్పకుండా వస్తాయి మహేంద్ర అని అంటుంది. దొంగ కడుపునొప్పులు ఎప్పుడైనా వస్తాయి అని అంటుంది. నాకు మొత్తం తెలుసు మహేంద్ర వసుధార రిషి కలిసి మిషన్ ఎడ్యుకేషన్ టూర్ కి వెళ్లాలని ఇలా ప్లాన్ చేశారు కదా అనగా ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని అనడంతో జగతి నా గురించి తెలుసు కదా మీరు మాట్లాడుకున్నవన్ని నేను చాటుగా విన్నానులే అని అంటుంది.
అసలు మీరు ఏం చేస్తున్నారు అర్థం అవుతుందా అనడంతో అవును వదినగారు నాటకమే ఆడాను.. రిషి వసుధార వెళ్లేలా చేశాను అయితే మీకు కడుపు నొప్పి ఏంటి అనడంతో జగతి నవ్వుతూ ఉంటుంది. నేను ఒకటే ఆడాను మీరు ఎన్నో నాటకాలు ఆడారు కాలేజీలో గూఢచారాలను నియమించారు చెప్పుకుంటూ పోతే చాలా చేశారు అనడంతో దేవయాని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ఈ విషయం నిన్ను రిషికి చెబుతాను అనడంతో చెప్పండి మీరు కూడా ఎప్పుడెప్పుడు చెబుతారని ఎదురు చూస్తున్నాను. మీరు కడుపునొప్పి గురించి మాత్రమే చెప్తారు కానీ మేము కడుపులో దాచుకున్నవన్నీ చెప్పేస్తాము అని జగతి మహేంద్ర వార్నింగ్ ఇవ్వడంతో దేవయాని టెన్షన్ పడుతూ ఉంటుంది.
అప్పుడు దేవయాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మన వైపు వసుధార కిచెన్ లో పాలు గిన్నెలోకి పోస్తూ రిషి అన్న మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు పాలు అన్నీ కూడా కింద పోస్తుండగా చక్రపాణి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావ్ అమ్మ అనడంతో అయ్యో నాన్న సారీ నాన్న అనగా పర్లేదు అమ్మ నేను తుడుస్తాను అని చక్రపాణి ఆ పాలు తుడుస్తాడు. ఏమైంది తల్లి? ఎందుకు ఇంత పరధ్యానం అని అంటాడు చక్రపాణి.. ఈ నాన్నకి నీ గురించి తలుచుకుంటే బాధేస్తోంది. ఎన్నాళ్ళని ఇలా మనసులో బాధ పెట్టుకొని బాధపడుతూ ఉంటావు అని అడుగుతాడు. అసలు విషయం చెప్పలేక నువ్వు అసలు నిజం తెలియక ఆ రిషి సారు ఎంత బాధ పడుతున్నారో నేను కళ్ళారా చూస్తున్నాను నా మాట విని రిషి సార్ కి నిజం చెప్పు అమ్మ అని అడుగుతాడు.
రిషి సార్ కి అసలు నిజం చెప్తే ఎలా అర్థం చేసుకుంటారు అని భయంగా ఉంది నాన్న అని అనడంతో రిషి సార్ మంచోడు మనసున్న గొప్ప మారాజు అని అంటాడు చక్రపాణి. సార్ గురించి నీకు అన్ని తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు అని ధైర్యం చెబుతాడు చక్రపాణి. చెప్పేస్తాను నాన్న మీరు అన్నట్టు నా మనసులోని భార్యని రిషి సార్ తో పంచుకుంటూ నా బాధను తగ్గించుకుంటాను అని అంటుంది వసుధార.