`నువ్వక్కడ నేనిక్కడ` అంటూ యాంకర్‌ సుమ, రాజీవ్‌ కనకాల ప్రేమ గీతం.. నెటిజన్ల శుభాకాంక్షలు..

Published : Feb 10, 2023, 10:44 PM IST
`నువ్వక్కడ నేనిక్కడ` అంటూ యాంకర్‌ సుమ, రాజీవ్‌ కనకాల ప్రేమ గీతం.. నెటిజన్ల శుభాకాంక్షలు..

సారాంశం

యాంకర్‌ సుమ, రాజీవ్‌ కనకాల వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇందులో వీరిద్దరు ప్రేమ గీతం ఆలపించడం విశేషం. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.

యాంకర్‌ సుమ తెలుగులో టాప్‌ యాంకర్‌. స్టార్‌ యాంకర్ కూడా. అత్యంత బిజీగా ఉండే యాంకర్‌. అత్యంత ఖరీదైనయాంకర్‌, అత్యంత టాలెంటెడ్‌ యాంకర్‌, అత్యధికంగా సంపాదిస్తున్న యాంకర్ కూడా. ఎక్కువగా షోలు చేస్తూ బిజీగా ఉండే యాంకర్‌ సుమ ఇటీవల తన పంథాని మారుస్తుంది. వరుసగా ఎంటర్‌టైనింగ్‌ షోస్‌ చేసే ఆమె, టాక్‌ షో కూడా చేస్తుంది. మరోవైపు సొంత యూట్యూబ్‌ ఛానెల్‌లో ఫన్నీ వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటుంది. 

ఇదిలా ఉంటే సుమ 24ఏళ్ల క్రితం నటుడు రాజీవ్‌ కనకాలని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. యాంకర్‌ సుమ కెరీర్‌ బిగినింగ్‌లో నటిగా నూ రాణించింది. హీరోయిన్‌గానూ చేసింది. ఈ క్రమంలో ఆమె దేవదాస్‌ కనకాల సీరియల్‌ చేస్తుండగా రాజీవ్‌ కనకాలతో పరిచయం ఏర్పడింది. అది కాస్త పెళ్లి వరకు వెళ్లింది. ఫిబ్రవరి 10 1999లో వీరి వివాహం జరిగింది. తాజాగా నేటితో(శుక్రవారం)తో వీరి మ్యారేజ్‌ జరిగి 24ఏళ్లు అవుతుంది. ఈ సందర్బంగా వెడ్డింగ్‌ యానివర్సరీ చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

కేరళాకి చెందిన సుమ యాంకర్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో స్థిరపడింది. టాప్‌యాంకర్‌గా ఎదిగింది. ఇప్పుడు రాణిస్తుంది. ఇదిలా ఉంటే యాంకర్‌ సుమ 24వ వెడ్డింగ్‌ యానివర్సరీ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఫన్నీ వీడియోని పంచుకుంది యాంకర్‌ సుమ. `నువ్వక్కడ నేనిక్కడ` అనే పాటని పాడుతూ తీసిన వీడియోని షేర్‌ చేసింది. వీడియో కాల్‌లో సుమ, రాజీవ్‌ కనకాల ఈ పాట పాడుతూ తీసిన వీడియో క్లిప్‌ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది సుమ. ఇందులో ఆమె చెబుతూ, 24ఏళ్ల ఏకత్వం, ఈ ఏడాది వార్షికోత్సవాన్ని ఆన్‌లైన్‌లో ఇలా జరుపుకుంటున్నాం` అని వెల్లడించింది. 

అయితే సుమ, రాజీవ్‌ కనకాల వేర్వేరు లొకేషన్ ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఇద్దరూ వీడియో ఛాట్‌లో `నువ్వక్కడ నేనిక్కడ` పాట పాడుతూ అలరించారు. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఓ హోటల్‌ నుంచి బయటకు వస్తున్నట్టుగా ఉన్న వీడియోని జతచేసి అభిమానులతో పంచుకోగా అది ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం సుమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియో వైరల్‌ అవుతుంది. 

ఇదిలా ఉంటే ఆ మధ్య కాలం వరకు సుమ, రాజీవ్‌ కనకాల మధ్య విభేదాలు తలెత్తాయని, దూరంగా ఉంటున్నారని, విడిపోబోతున్నారనే పూకార్లు కూడా వినిపించాయి. కానీ వాటికి చెక్‌ పెడుతూవస్తున్నారు. తాజాగా మరోసారి తమ మధ్య ఏం లేదనే విషయాన్ని స్పష్టంచేశారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో