జగపతిబాబు సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్ ని ఉద్దేశించి షాకింగ్‌ పోస్ట్..

By Aithagoni Raju  |  First Published Oct 7, 2023, 9:22 PM IST

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న జగపతిబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అభిమాన సంఘాల విషయంలో ఆయన షాకింగ్‌ డెసీషన్‌ తీసుకున్నారు. ఇప్పుడది వైరల్‌ అవుతుంది.


మ్యాన్లీ హీరో జగపతిబాబు ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మారి సినిమాలు చేస్తుంది. విలన్‌గా, బలమైన పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. సినిమా ఏదైనా, హీరో ఎవరైనా బలమైన పాత్రలుంటే తాను నటించేందుకు సిద్ధమే అంటున్నారు. హీరోగా కంటే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్నా ఆయన క్రేజ్‌ మరింత పెరిగింది, డిమాండ్‌ కూడా పెరిగింది. నటుడిగా బిజీగా జగపతిబాబు ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఆయన తీసుకున్న నిర్ణయం షాకిస్తుంది. ఇకపై తనకు, తన పేరుతో ఉన్న అభిమాన సంఘాలకు సంబంధం లేదని తేల్చి చెప్పాడు. ట్రస్ట్ కి కూడా తాను దూరం అవుతున్నట్టు తెలిపారు. 

ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా అభిమానులను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. ఇందులో జగపతిబాబు చెబుతూ, `33ఏళ్లగా నా కుటుంబం శ్రేయోభిలాషుల్లాగ నా అభిమానులు కూడా నా పెరుగుదలకి ముఖ్యకారణంగా భావించాను. అలాగే వాళ్ల ప్రతి కుటుంబ విషయాల్లో పాల్గొని వాళ్ల కష్టాల్ని నా కష్టాలుగా భావించి వాళ్లు నాకు తోడుగా ఉన్న నా అభిమానులకు నేను నీడగా ఉన్నా. అభిమానులంటే అభిమానం ప్రేమ ఇచ్చేవాళ్లని మనస్ఫూర్తిగా నమ్మాను. 

Latest Videos

కానీ బాధాకరమైన విషయం ఏంటంటే కొంత మంది అభిమానులు ప్రేమ కంటే ఆశించడం ఎక్కువ అయిపోయింది. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకువచ్చారు. మనసు ఒప్పుకోకపోయినా, బాధతో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక నుంచి నేను నా అభిమాన సంఘాలకు, ట్రస్ట్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. వాటి నుంచి విరమించుకుంటున్నాను. అయితే కేవలం ప్రేమించే అభిమానులకి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను` అని వెల్లడించారు జగపతిబాబు. జీవించండి, జీవించనివ్వండి అని పేర్కొన్నారు జగపతిబాబు. 

నా అభిమానులకు మనవి…. pic.twitter.com/iLN9tToL7T

— Jaggu Bhai (@IamJagguBhai)

దీంతో అభిమానులు సైతం ఆయనకు సపోర్ట్ గా నిలుస్తుంది. మంచి నిర్ణయమని అంటున్నారు. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వారికి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అండగా ఉంటే చాలు అంటున్నారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్‌ అవుతుంది. జగపతిబాబు ఇటీవల `రుద్రంగి` చిత్రంతో మంచి ప్రశంసలందుకున్నారు. ప్రస్తుతం `సలార్‌` వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఓటీటీ మూవీస్‌ కూడా చేస్తూ బిజీగా ఉంటున్నారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలు చేస్తున్నారు జగపతిబాబు. ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరైన విషయం తెలిసిందే. 

click me!