సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ.. టాలీవుడ్ లో తనను తాను కొత్త గా చూపించుకుంటున్నాడు నేచురల్ స్టార్ నాని. తాజాగా ఆయన ఫ్రెష్ లుక్స్.. ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తున్నాయి.
సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ.. టాలీవుడ్ లో తనను తాను కొత్త గా చూపించుకుంటున్నాడు నేచురల్ స్టార్ నాని. తాజాగా ఆయన ఫ్రెష్ లుక్స్.. ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరో.. నేచురల్ స్టార్ నాని న్యూలుక్ లో మెరిసిపోతున్నాడు. వరుసగా ప్రయోగాలు చేస్తూ.. గెలుపు ఓటములతో సబంధం లేకుండా.. దూసుకుపోతున్న నానీకి.. రీసెంట్ గా దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ దగ్గింది. దసరా సినిమాలో డీ గ్లామర్ లుక్ లో అలరించిన నానీ.. ప్రస్తుతం అలాంటి మరో ప్రయోగాత్మక సినిమాతో ముందుకు రాబోతున్నాడు.
ప్రస్తుతం శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హాయ్ నాన్న మూవీ చేస్తున్నారు నాని. ఒక యంగ్ హీరో నాన్న పాత్ర చేయడం.. అది కూడా రెండో సారి సాహసమనేచెప్పాలి. ఇక ఈమూవీలో యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తండ్రి కూతురి సెంటిమెంట్ కథగా తెరకెక్కుతుండగా వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది.
ఈసినిమా తరువాత కూడా వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు నాని. ఈసినిమా తరువాత కూడా నాని మరో సినిమా లైన్ అప్ చేశాడు. వివేక్ ఆత్రేయతో నెక్స్ట్ మూవీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు నేచురల్ స్టార్.
అయితే విషయం ఏమిటంటే, ఎప్పటికప్పుడు తన సినిమాల్లోని పాత్రల కోసం లేటెస్ట్ స్టైల్ ని ట్రెండ్ ని ఫాలో అవుతుంటారు నాని. ఇక తాజాగా షార్ట్ హెయిర్ తో ట్రెండీ స్టైల్ కలెక్షన్ కాస్ట్యూమ్స్ తో అదరగొట్టే రేంజ్ లో నాని దిగిన ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ లుక్ ఆయన నెక్స్ట్ సినిమా కోసం చేశాడంటున్నారు.