Jawan Ott: షారూఖ్‌ ఖాన్‌ `జవాన్‌` మూవీ ఓటీటీ లో వచ్చేది అప్పుడే?

Google News Follow Us

సారాంశం

షారూఖ్‌ ఖాన్‌.. ఇటీవల `జవాన్‌` సినిమాతో సంచలనం సృష్టించింది. కలెక్షన్ల వర్షం కురిపించిందీ మూవీ. అయితే ఇప్పుడీ చిత్రం ఓటీటీలోనూ సందడి చేయడానికి వస్తుంది. ఆ డేట్‌ ఫిక్స్ అయ్యిందట.

బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌కి గత నాలుగైదేళ్లుగా హిట్‌ లేదు. ఆయన భారీ సినిమాలు చేశారు, అవన్నీ బోల్తా కొట్టాయి. ఆడియెన్స్ ని మెప్పించలేకపోయాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ప్రతి సినిమా డిజప్పాయింట్‌ చేసింది. ప్రయోగం చేసిన `జీరో` చిత్రం, `ఫ్యాన్‌` లాంటి మూవీస్‌ కూడా నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో కొంత గ్యాప్‌ తీసుకున్నారు షారూఖ్‌. దాదాపు రెండేళ్లపాటు ఆయన నుంచి అప్‌డేట్‌ లేదు. అంతా ఆశ్చర్యపోయారు. షారూఖ్‌ సినిమాలకు గుడ్‌ బై చెబుతున్నాడా? అనే వార్తలు కూడా వచ్చాయి. 

అలాంటి దశలో ఆయన బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు సినిమాలతో వచ్చారు. నిజం చెప్పాలంటే రెండు సంచలనాలతో వచ్చారు. ఓకే ఏడాది రెండు భారీ చిత్రాలతో రావడం మాత్రమే కాదు, రికార్డులు క్రియేట్‌ చేశారు. ఆయన నటించిన రెండు చిత్రాలు వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు చేయడం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో `పఠాన్‌`తో వెయ్యి కోట్లు వసూలు చేశారు. ఎనిమిది నెలల గ్యాప్‌తో `జవాన్‌`తో వచ్చాడు. ఈ చిత్రం కూడా సుమారు 1100కోట్ల గ్రాస్‌ రాబట్టింది. తెలుగులోనే సుమారు 55కోట్లు రాబట్టడం విశేషం. 

ఇక అట్లీ దర్శకత్వం వహించిన `జవాన్‌`లో షారూఖ్‌ రెండు పాత్రలు పోషించారు. తండ్రిగా,కొడుకుగా ద్విపాత్రాభినయం చేసి విశ్వరూపం చూపించాడు. ఆయనకు జోడీగా దీపికా పదుకొనె, నయనతార కథానాయికలుగా నటించారు. విజయ్‌ సేతుపతి నెగటివ్‌ రోల్‌ చేశారు. ఈ చిత్రం విడుదలై నెల రోజులవుతుంది. సెప్టెంబర్‌ 7న వచ్చిన విషయం తెలిసిందే. థియేటర్లో క్లోజ్‌ అయ్యింది. అయితే ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. నెట్‌ ఫ్లిక్స్ లో ఈ మూవీ రానుంది. తాజాగా ఓటీటీపై ఓ అప్‌డేట్‌ వినిపిస్తుంది. నవంబర్‌ 2న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతుందట. 

అయితే ఓటీటీలో మాత్రం ఆడియెన్స్ సర్‌ప్రైజ్‌ ఉంటుందని తెలుస్తుంది. సినిమా నిడివిని దృష్టిలో పెట్టుకుని థియేటర్‌ రిలీజ్‌కి సంబంధించి చాలా సన్నివేశాలు కట్‌ చేశారట. ఇంపార్టెంట్‌ సీన్లని యాడ్‌ చేయబోతున్నారట. ఈ లెక్కన సినిమా మరో పదిహేను నిమిషాల నిడివి యాడ్‌ అవుతుందని, మూడు గంటల 15 నిమిషాలతో ఓటీటీలో `జవాన్‌`ని రిలీజ్‌ చేయబోతున్నారని సమాచారం. మరి ఇంత పెద్ద నిడివిని ఓటీటీలో ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...