Jagapathi Babu: హీరో, విలన్ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడు జగపతిబాబు.. ఆయన అందరికీ సూపరిచితులే. లెజెండ్ సినిమా దగ్గరి నుంచి రంగస్థలం... నిన్న మొన్న విడుదలైన పుష్ప-2 వంటి సినిమాల్లో విలన్‌గా నటించి అందరినీ మెప్పిస్తున్నారు. ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో వెంటనే ప్రతినాయకుడి సక్సెస్‌ను అందుకుని తన జర్నీని విజయవంతంగా కొనసాగిస్తున్నారు జగపతిబాబు. ఇక ఆయన నటన, సినిమాల ప్రస్తావన పక్కనపెడితే.. నిజ జీవితంలో ముక్కుసూటి మనిషి, ఎవడేమనుకున్నా ఉన్నది ఉన్నట్లు చెప్పేయడం అలావాటు. ఆయన రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తన పెద్ద కూతురికి పెళ్లిచేసి తప్పుచేశానని సంచలన కామెంట్లు చేశారు. రెండో అమ్మాయికి పెళ్లి చేయనని అంటున్నారు. ఆయన అలా ఎందుకన్నారంటే..
జగపతిబాబుకి ఇద్దరు కుమార్తెలు. ఆయనికి క్యాష్ట్ ఫీలింగ్ లేదు. కులం గురించి ఎవరైనా ప్రస్తావన తెస్తే అసలు సహించడు. దీంతో పెద్ద కుమార్తెకు కులాంతర, మతాంతర వివాహం కాదు ఏకంగా ఖండాంతర వివాహం చేశాడు. జగపతిబాబు కుమార్తె అమెరికాకు చెందిన ఓ వ్యక్తిని ప్రేమించగా.. ఆమె ఇష్ట ప్రకారం అతనికే ఇచ్చి పెళ్లి చేశాడు. రీసెంట్‌గా ఆమె వివాహం గురించి మాట్లాడుతూ.. కూతురి పెళ్లిచేసి చాలా పెద్ద తప్పు చేశానని అన్నారు.
నీ లైఫ్ నీ ఇష్టం...
అయితే... పెద్ద కుమార్తెకు పెళ్లి చేసి తప్పు చేయడం ఏంటని నెటిజన్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జగపతిబాబు కుమార్తెకు డైవర్స్ అయ్యాయేమో అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి ఆయన ప్రస్తావించలేదు. తన పెద్ద కుమార్తె నాకు పిల్లలు వద్దు ఎవరినైన దత్తత తీసుకుని పెంచుకుంటాను అని జగపతిబాబుకు చెప్పగా... ఆయన సరే అన్నారంట.. ఏదైనా నీ ఇష్టం నీకు ఏది నచ్చితే అది చేయ్.. నీ లైఫ్ నీ ఇష్టం... అని చెప్పేశారంట.
పిల్లలకు పెళ్లి చేసిన తర్వాత.. వారికి కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వారిపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులు, బాధ్యతలు ఉండవని జగపతిబాబు చెప్పుకొచ్చారు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలపై బాధ్యతలు, హక్కులు ఉన్నాయని వారి ఆశయాలు, కలలను పిల్లలపై రుద్దడం సరికాదన్నారు. లైఫ్‌లో ఏదొచ్చిన ఫేస్ చేయాల్సింది పిల్లలే కదా.. ఒకరి బాధను, నొప్పిని మనం అర్థం చేసుకోవగలం కానీ దాన్నీ తీసుకోలేం కదా.. అని జగపతిబాబు అంటున్నారు. పిల్లల ఇష్టాలు, నిర్ణయాలను ప్రేమతో స్వీకరించి స్వేచ్చ ఇవ్వాలని అంటున్నారాయన.
నాకు నేనుగా పెళ్లి మాత్రం చేయనని..
ఇక పెళ్లి విషయానికి వస్తే.. పెద్ద కుమార్తెకు పెళ్లి చేసి తప్పు చేశానని, అందుకే చిన్న కుమార్తెకు తాను పెళ్లి చేయనని చెప్పేశారంట జగపతిబాబు. కన్నకూతురికి పెళ్లి చేయడం బాధ్యత కాదా అని యాంకర్ ప్రశ్నించగా.. తొక్కలో బాధ్యత.. ఎందుకు బాధ్యత అవుతుంది. తన ఇష్టాలను గౌరవించడం ప్రేమ అవుతుంది. తల్లిదండ్రులకు ఉండాల్సింది బాధ్యత కాదు.. ప్రేమ అని చెప్పారు. చిన్న కుమార్తెకు ఇదే చెప్పానని, నేను అయితే పెళ్లి చేయను.. నువ్వు ఎవరినైనా ఇష్టపడినా, ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పు.. అతన్ని పెళ్లి చేసుకుంటానంటే అప్పడు పెళ్లి చేస్తా... నాకు నేనుగా పెళ్లి మాత్రం చేయనని చిన్న కుమార్తెకు జగపతిబాబు చెప్పారంట.
జగపతిబాబు భార్యది కూడా అదేమాట..
పిల్లలు నచ్చినట్లు బతకనిస్తే అది ప్రేమ అవుతుందని. బాధ్యత అంటే మన స్వార్థం కోసం పిల్లలను బలిచేయడమే అని అంటున్నారు జగపతిబాబు. తన దృష్టిలో బాధ్యతకంటే.. ప్రేమ గొప్పదని అంటున్నారు. బాధ్యత అనేది రాంగ్ వార్డ్ అని.. అసలు అది లేదని చెబుతున్నారు జగపతిబాబు. తన దృష్టిలో బాధ్యత అంటే పిల్లల్ని పెళ్లి చేసుకోమని చెప్పడం.. ప్రేమ అంటే నీకు ఏది ఇష్టమైతే అది చేయమని పిల్లలకు చెప్పడమని జగపతిబాబు అన్నారు. పిల్లల విషయంలో తీసుకునే నిర్ణయాల్లో తనతో తన భార్య కూడా ఏకీభవిస్తుందని చెప్పడ గమనార్హం.