‘జగమే తంత్రం’ రిలీజ్ ఎన్ని గంటల నుంచంటే..

By Surya PrakashFirst Published Jun 18, 2021, 7:24 AM IST
Highlights

 ఈ చిత్రం ఈ రోజే విడుదల కానుంది. సాధారణంగా ఓటీటీలో కొత్త సినిమాలు ముందు రోజు అర్థరాత్రి 12 గంటలకు నుంచి స్ట్రీమ్‌ అవుతుంటాయి. 

తమిళ స్టార్ హీరో ధనుష్ కొత్త సినిమా ‘జగమే తంత్రం’  నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న డైరక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకి దర్శకుడు కావడంతో.. ప్రేక్షకుల్లో ఈ సినిమా పై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రం ఈ రోజే విడుదల కానుంది. సాధారణంగా ఓటీటీలో కొత్త సినిమాలు ముందు రోజు అర్థరాత్రి 12 గంటలకు నుంచి స్ట్రీమ్‌ అవుతుంటాయి. అయితే ‘జగమే తంత్రం’ ముందు రోజు అర్ధరాత్రి కాకుండా 18న మధ్యాహ్నం 12.30 గంటల నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కాబోతోంది.

 తమిళ చిత్రం ‘జగమే తందిరమ్‌’ కు తెలుగు వెర్షన్ ‘జగమే తంత్రం’. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్‌డౌన్‌/కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయాలని చిత్రటీమ్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. జూన్ 18న ఈ సినిమా 190 దేశాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏడు వేర్వేరు భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమా బిజినెస్ పరంగా టేబుల్ ప్రాఫిట్ అని తెలుస్తోంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ..ఈ చిత్రం టోటల్ బిజినెస్ 65 కోట్లు చేసింది. నెట్ ప్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ నిమిత్తం 44 కోట్లు చెల్లించింది. అలాగే తమిళ శాటిలైట్ రైట్స్ విజయ్ టీవి 9కోట్లు పెట్టి తీసుకుంది. హిందీ డబ్బింగ్, యుట్యూబ్ తో కలిపి 8 కోట్లు దాకా వస్తున్నాయి. ఓవర్ సీస్ రైట్స్ ,మలేషియా టీవి ఛానెల్స్, ఇన్ ప్లైట్,సింప్లీ సౌత్ వంటివి అన్ని కలిపి 2.5 కోట్ల రూపాయలు వచ్చాయి. సోనీ మ్యూజిక్ సౌత్ ఆడియో రైట్స్ నిమిత్తం 1.5 కోట్లు ఇచ్చారు. అలా అన్ని కలిసి 65 కోట్లు దాకా బిజినెస్ చేసింది.

  ధనుష్‌ ఇందులో సూరాలి అనే గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇది పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా చిత్రంగా ఉండనుంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, వై నాట్‌ స్టుడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శశికాంత్‌, చక్రవర్తి, రామచంద్ర నిర్మాతలు. సంతోష్‌ నారాయణ స్వరాలు సమకూరుస్తుండగా వివేక్ హర్షన్‌ ఎడిటర్‌ పనిచేశారు. ధనుశ్‌కి ఇది 40వ సినిమా కావడం విశేషం.

click me!