బన్నీ వైఫ్‌కి క్రేజ్‌ మామూలుగా లేదుగా..ఏ స్టార్‌ హీరో భార్యకి సాధ్యంకానీ రికార్డ్ స్నేహారెడ్డి సొంతం

Published : Jun 17, 2021, 05:09 PM ISTUpdated : Jun 17, 2021, 05:10 PM IST
బన్నీ వైఫ్‌కి క్రేజ్‌ మామూలుగా లేదుగా..ఏ స్టార్‌ హీరో భార్యకి సాధ్యంకానీ రికార్డ్  స్నేహారెడ్డి సొంతం

సారాంశం

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భార్య అల్లు స్నేహారెడ్డి అరుదైన రికార్డ్‌ని క్రియేట్‌ చేశారు. ఏ స్టార్‌ హీరో భార్యకి సాధ్యం కాని రికార్డుని స్నేహారెడ్డి సాధించారు. టాప్‌లో నిలిచింది. దీంతో ఇప్పుడు తానొక స్పెషల్‌గా నిలిచింది. 

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భార్య అల్లు స్నేహారెడ్డి అరుదైన రికార్డ్‌ని క్రియేట్‌ చేశారు. ఏ స్టార్‌ హీరో భార్యకి సాధ్యం కాని రికార్డుని స్నేహారెడ్డి సాధించారు. టాప్‌లో నిలిచింది. దీంతో ఇప్పుడు తానొక స్పెషల్‌గా నిలిచింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇంతకి ఏం జరిగిందంటే అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో రేర్‌ ఫీట్‌ని చేరుకుంది. ఆమె 4 మిలియన్ల ఫాలోవర్స్ ని రీచ్‌ అయ్యింది. యంగ్‌ హీరోయిన్లకి కూడా ఈ రేంజ్‌లో ఫాలోయింగ్‌ లేదంటే అతిశయోక్తి కాదు. 

అల్లు స్నేహారెడ్డి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తమ పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్‌ ఫోటోలను, వారు చేసే క్యూట్‌ క్యూట్‌ పనులను వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంది స్నేహారెడ్డి. మరోవైపు భర్తతోపాటు ఉండే పలు రేర్‌ పిక్స్ ని షేర్‌ చేస్తుంది. సోషల్ మీడియాలో నిత్యం అభిమానులకు టచ్‌లో ఉంటుంది. వారితో చాట్‌ చేయడం, మరోవైపు ఎప్పటికప్పుడు తమకి, తమ పిల్లలకి సంబంధించిన అప్‌డేట్స్ , ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకోవడంతో నెటిజన్లకి అందుబాటులో ఉంటుంది స్నేహారెడ్డి. 

దీంతో స్టార్‌ హీరోల భార్యల్లో ఇంతటి ఫాలోయింగ్‌ ఉన్న వైఫ్‌గా స్నేహారెడ్డి రికార్డు సృష్టించింది. తనకు సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ని తెలియజేశారు. ఇంతకి నిత్యం సోషల్‌ మీడియాలో ఉండే రామ్‌చరణ్‌ భార్య ఉపాసన కూడా ఇంకా త్రీ మిలియన్స్ లోనే ఉన్నారు. అలా స్నేహారెడ్డి ఎవరికీ సాధ్యం కాని రికార్డుని సొంతం చేసుకున్నారు. బన్నీ ప్రస్తుతం `పుష్ప` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్