ఆ ఛాన్స్ వస్తుందనుకోలేదు.. అదే నా మొదటి సంపాదనః విద్యాబాలన్‌

Published : Jun 17, 2021, 08:27 PM IST
ఆ ఛాన్స్ వస్తుందనుకోలేదు.. అదే నా మొదటి సంపాదనః విద్యాబాలన్‌

సారాంశం

తనకు తొలి అవకాశం వస్తుందని ఊహించలేదని, నమ్మకం లేకుండానే షూట్‌కి వెళ్లానని చెప్పింది విద్యాలన్‌. ఈ సందర్భంగా తాను తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్‌ ఎంతో వెల్లడించి షాక్‌ ఇచ్చింది. 

తనకు తొలి అవకాశం వస్తుందని ఊహించలేదని, నమ్మకం లేకుండానే షూట్‌కి వెళ్లానని చెప్పింది విద్యాలన్‌. ఈ సందర్భంగా తాను తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్‌ ఎంతో వెల్లడించి షాక్‌ ఇచ్చింది. బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న విద్యా బాలన్‌ ప్రస్తుతం `షేర్నీ` చిత్రంలో నటించింది. ఈ సినిమా రేపు(జూన్‌ 18న) విడుదల కాబోతుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో ఇది రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది. 

ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన విద్యా బాలన్‌ ఒక్కో సినిమాకి కోట్లల్లో పారితోషికం అందుకుంటుంది. అయితే ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను అందుకున్న తొలి పారితోషికం రూ. ఐదు వందలని వెల్లడించింది. ఓ టూరిస్ట్ క్యాంపెయిన్‌ కోసం ఫోటో షూట్‌లో పాల్గొన్నదట. తన స్నేహితులు, కజిన్స్‌తో కలిసి ఆ టూరిస్టు క్యాంపైన్‌ ఫొటోషూట్‌లో పాల్గొన్నట్టు చెప్పింది. 

ఈ ఫొటోషూట్‌లో వీరంతా ఓ చెట్టు పక్కన నిలుచుని చిరు నవ్వులు చిందిస్తూ ఫొటోకు ఫోజ్‌ ఇవ్వాలి. అలా ఫొటోలకు ఫోజులిచ్చినందుకు ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇచ్చారట. అదే తన తొలి సంపాదన అని చెప్పింది విద్యా బాలన్‌.  విద్యాబాలన్‌ `హమ్‌ పాంచ్‌` సీరియల్‌తో నటిగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సీరియల్ ఆడిషన్స్ కోసం తన తల్లి, సోదరితో కలిసి ఫిల్మ్ సిటీకి వెళ్లిందట. రోజంతా అక్కడే ఉన్నారట. దాదాపు అక్కడికి 150 మంది వరకు ఆడిషన్స్ కు వచ్చారని, వారందరిని చూసి తనకు అవకాశం రాదనుకున్నానని, కానీ చివరకి అందులో నటించే ఛాన్స్ వచ్చినట్లుగా చెప్పుకోచ్చింది విద్యాబాలన్.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్