మళ్లీ థియేటర్లోకి చిరంజీవి సంచలన మూవీ.. వెండితెరపై అతిలోక సుందరిని మళ్లీ చూసుకునే భాగ్యం

Published : Apr 28, 2025, 09:40 PM IST
మళ్లీ థియేటర్లోకి చిరంజీవి సంచలన మూవీ.. వెండితెరపై అతిలోక సుందరిని మళ్లీ చూసుకునే భాగ్యం

సారాంశం

చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన సంచలన మూవీ `జగదేక వీరుడు అతిలోక సుందరి` మూవీ ఇప్పుడు మరోసారి మ్యాజిక్‌ చేయడానికి రాబోతుంది. ఈ చిత్రాన్ని మళ్లీ రీ రిలీజ్‌ చేయబోతున్నారు. ఆ విషయాన్ని తాజాగా ప్రకటించింది టీమ్‌. మరి సినిమా ఎప్పుడు రిలీజ్‌ అంటే. 

మెగాస్టార్‌ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి కలిసి నటించిన చిత్రాల్లో `జగదేక వీరుడు అతిలోక సుందరి` మూవీ ఒకటి. చిరంజీవి కెరీర్‌లో ఇదొక బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ కూడా. అప్పట్లో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రం. శ్రీదేవిని అతిలోక సుందరిగా మార్చేసిన మూవీ. ఇప్పటికీ తెలుగు సినిమా చరిత్రలోనే కాదు, ఇండియన్‌ మూవీ హిస్టరీలోనూ ఇదొక క్లాసిక్‌గా మిగిలిపోయింది. 

భారీ బడ్జెట్‌తో జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ

1990లో విడుదలైన ఈ చిత్రంలో చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించగా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మించారు. అప్పట్లోనే ఇది భారీ బడ్జెట్‌ మూవీ. చాలా సాహసోపేతంగా నిర్మించారు. సోషియో ఫాంటసీగా తెరకెక్కించారు. దేవలోకానికి, భూలోకానికి ముడిపెడుతూ భూలోకం వచ్చిన ఒక దేవకన్య,తన మాంత్రిక ఉంగరాని కోల్పోయి దేవలోకానికి వెళ్లే శక్తిని కోల్పోతుంది. 

ఉంగరం చుట్టూ తిరిగే కథ 

ఆ ఉంగరాన్ని కనిపెట్టి, మళ్లీ దేవలోకానికి వెళ్లిపోవాలనుకుంటుంది. అందుకోసం చిరంజీవితో ఉంటూ, ఆయన సహాయం తీసుకుంటూ ఆ ఉంగరాన్ని పొందాలనుకుంటుంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న డ్రామా, ట్విస్ట్ ల సమాహారమే ఈ మూవీ. ఆద్యంతం కనువిందు చేసే ఈ చిత్రం పెద్ద హిట్‌ అయి చిరంజీవి కెరీర్‌ని మార్చేసింది. ఆయన్ని తిరుగులేని మెగాస్టార్‌ని చేసింది. 

జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్‌

ఈ సినిమా ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు. చాలా మంది చూసి ఉండరు. కానీ ఇప్పటి తరం కూడా ఈ సినిమాని చూడాలని, బిగ్‌ స్క్రీన్‌ పై చూసే అవకాశాన్ని మేకర్స్ కల్పిస్తున్నారు. అందులో భాగంగా `జగదేక వీరుడు అతిలోక సుందరి` చిత్రాన్ని రీ రిలీజ్‌ చేస్తున్నారు. 1990 మే 9న ఈ చిత్రం విడుదలైంది. ఈ మూవీ విడుదలై ఇప్పటి వరకు 35ఏళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల మే 9న ఈ మూవీని రీ రిలీజ్‌ చేయబోతున్నారు. 

జగదేక వీరుడు అతిలోక సుందరి తెరవెనుక కథలు

ఈ విషయాన్ని వెల్లడించింది టీమ్‌. ఈ మేరకు ఈ మూవీకి సంబంధించిన అన్‌ టోల్డ్ స్టోరీస్‌ని వివరిస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. నాని వాయిస్‌ ఓవర్‌తో ఈ వీడియోని డిజైన్‌ చేశారు. బయటకు రాని చాలా విషయాలను ఇందులో వివరించడం విశేషం. ఆద్యంతం క్యూరియాసిటీని క్రియేట్‌ చేసేలా ఉంది. సినిమా రీ రిలీజ్‌ వరకు ఒక్కో ఎపిసోడ్‌ లాగా సినిమాకి సంబంధించిన అరుదైన విషయాలను పంచుకుంటారట. మరి అప్పట్లో సంచలనాలు సృష్టించిన మూవీ, ఇప్పుడు రీరిలీజ్‌ లో రికార్డ్స్ క్రియేట్‌ చేస్తుందా అనేది చూడాలి. 

read  more: `బాహుబలి` రీ రిలీజ్‌, ఆయన పుట్టిన రోజు స్పెషల్‌ ?

also read: చిరంజీవి కథ మార్చకుంటే జగదేక వీరుడు అతిలోక సుందరి ఫ్లాప్ ? మెగాస్టార్ ఏం చేశారో తెలుసా
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్